నిరంతర రామనామ పారాయణుడు, రామ కార్య సాధకుడు సీతాన్వేషణ కోసం ఒక్క పెట్టున నూరు యోజనాల సముద్రాన్ని లంగించి సీతా మాతను వెతికి తన వాలంతో లంకను కాల్చి అశోకవన విద్వంశం చేసిన వాడు లంకలోని రాక్షసుల వధ గావించిన వాడు మహా బలిశాలి రామదాసుడు అయిన హనుమంతుని కార్యసిద్ధి హనుమాన్ ఆలయం Karya Siddhi Hanuman Temple మరియు అక్కడి విధి విధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రామాయణంలో రాముని కార్య సాధకుడిగా Karya Siddhi Hanuman
రామాయణంలో రాముని తరువాత అంత ఉన్నత స్థానాన్ని అందుకున్న రామ దాసుడు ఆంజనేయ స్వామి మనిషి అవతారం లో పుట్టి దేవుడిగా ఎదిగిన వ్యక్తి రాముడైతే వానరునిగా పుట్టి రామునికి భక్తునిగా మారి ఇప్పుడు భక్తులచే పూజలు అందుకుంటున్న దేవుడు హుమంతుడు. రామాయణంలో రాముని కార్యాన్ని సఫలం చేసి సీతాదేవిని జాడను తెలిపి కార్యసాధకుడు Hanuman నేడు భక్తుల మనోబీస్టాలను నెరవేరుస్తూ కార్య సిద్ది ప్రదాత అయ్యాడు.
Karya Siddhi Hanuman Temple Bangalore
బెంగుళూరు నగరంలోని గిరినగర్ లో ఉన్న హనుమాన్ ఆలయం దీనిపేరే కార్యసిద్ధి హనుమాన్ ఆలయం Karya Siddhi Hanuman Temple. ఈ ఆలయానికి పలు విశిష్టతలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆలయ ప్రదక్షణ. ఈ ఆలయంలో ఎప్పుడూ భక్తుల కోలాహలంతో సందడిగా ఉంటుంది. ఇక మంగళవారం మరియు శనివారాలు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఈ రెండు రోజులూ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వేళల్లో భక్తులు ఇక్కడికి వస్తారు.
Karya Siddhi Hanuman Temple History – కార్యసిద్ది హనుమాన్ ఆలయ చరిత్ర
అనేకమంది భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుతుండడంతో బెంగుళూరు నగరంలో ఉన్న ఈ Karya Siddhi Hanuman ఆలయంలో ఆంజనేయ స్వామికి మరియు Karya Siddhi Hanuman Temple గా ఈ ఆలయానికి ఎంతో విసిస్టత నెలకొంది. ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తారో వారు కోరుకున్న కార్యం నెరవేరుతుందనే నమ్మకం భక్తుల్లో ఉండడంతో ఆంజనేయ స్వామీ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు.
Karya Siddhi Anjaneya Temple విశేషాలు
కర్నాటక గిరినగర్ లో ఉన్న ఈ హనుమంతుడు కోరిన కోర్కెలు నెరవేర్చడంతో పాటు తలపెట్టిన కార్యాన్ని సాదించే అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు Karya Siddhi Anjaneya కనుకే కార్య సాధక హనుమంతునిగా ఈ స్వామికి ఇక్కడ విశిష్టత ఏర్పడింది. ఇక్కడ గుడిలోకి ప్రవేశించగానే 50 అడుగుల ఎత్తుగల అభయ ముద్రలో నిలబడి ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది.
నిలబడి ఉన్న కార్యసాధక హనుమాన్ Karya Siddhi Anjaneya మూర్తి సుందర రూపంతో చేతులు జోడించి ఉన్న మూర్తి బక్తులకు దర్శనమిస్తాడు ఈ ఆంజనేయ స్వామి కి ఎదురుగా దత్తాత్రేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది ఈ దత్తాత్రేయ స్వామిని శ్రీదత్త యోగిరాజు గా పిలుస్తారు.

దత్తాత్రేయుడు ఎలాగైతే త్రిమూర్తి స్వరూపమో అలాగే దత్తాత్రేయుని బార్య అనఘాదేవి త్రిదేవి అవతారం అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవీ ల అవతారంగా చెబుతారు. ఈ కార్యసాధక హనుమాన్ మందిరంలో దత్తాత్రేయ స్వామి తో పాటు అనఘాదేవి కూడా దర్శనమిస్తూ బక్తులకు అభయ ప్రదాయినిగా కోలువైనారు.
ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు కావున ఈ ఆలయంలో Hanuman తో పాటు పరమశివుడు కూడా ఈ ఆలయంలో కోలువైనాడు. ఇక్కడ అత్యంత పవిత్రమైన సాలగ్రామ శిల తో రూపొందిన ఇక్కడి శివలింగం సచ్చిదానందేస్వర స్వామిగా ఇక్కడ భక్తులు పూజలు చేస్తారు ఈ శివలింగానికి ఎదురుగా ఆయన వాహనం నందీశ్వరుడు కొలువై ఉంటాడు.

ఇక ఈ Karya Siddhi Anjaneya Temple లో విగ్ననాసకుడు గణపతి సైతం కొలువై ఉన్నాడు ఈయన చతుర్భుజుడై ముగ్ధ మనోహర రూపంతో దర్శనమిస్తాడు. అంతేకాక ఇక్కడ వినాయకుని దర్శించుకోవడం కోసం బక్తులు నాలుగుపలకల బెల్లం ముక్క మద్యలో గుంట చేసి దానిలో నేయ్యవేసి దీపాన్ని వెలిగిస్తారు.
ఎవరైతే తాము తలపెట్టిన కార్యం చదువు, పెళ్లి, వ్యాపారం, ప్రయాణం, పిల్లలు, ఇల్లు వంటి ఏ కార్యం మొదలు పెట్టే ముందు ఈ కార్యసాధక హనుమాన్ ఆలయానికి తోలు తీయని ఓకే కొబ్బరికాయను తీసుకుని ఏదైతే కార్యం నెరవేరాలని అనుకుంటున్నారో దానికోసం
Karya Siddhi Hanuman Mantra
తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ |
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||
ఈ Karya Siddhi Hanuman Mantra మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపిస్తూ వారానికి రెండు రోజులు 41 ప్రదక్షణలు చేస్తూ మొత్తం 16 రోజుల దీక్షతో ఎవరైతే చేస్తారో వారు తలపెట్టిన కార్యం లేదా కోరిక తప్పక నెరవేరుతుంది అందుకే ఈ ఈయనను కార్యసిద్ధి హనుమంతునిగా కొలుస్తారు.
Karya Siddhi Hanuman Coconut Pooja Rules – కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో కొబ్బరికాయలతో పూజ
ఈ ఆలయంలో బక్తులు ప్రదక్షిణ చేసే ప్రదేశంలో ఎక్కడ చూసినా కొబ్బరికాయలె కనిపిస్తాయి. బక్తులు ఈ కొబ్బరికాయలను కట్టేముందు మనస్సులో కోరికను సకల్పం చెప్పుకిని వరుస క్రమంలో ఒకరి ప్రక్కన ఒకరు కొబ్బరికాయలను కడతారు. ఈ కొబ్బరికాయల అమరికను చూస్తే గుడికి మామిడాకుల తోరాలు కట్టిన చందాన అద్భుతంగా కానవస్తాయి.

అయితే మనం అక్కడ మొదటి రోజు కొబ్బరికాయ తీసుకున్నప్పుడు అక్కడే ఉన్న కౌంటర్ లో ఇస్తే ఆ కౌంటర్ లో ఆ కొబ్బరి కాయపై డేట్ ప్రింట్ చేసి ఇస్తారు. ఈ గుడికి వచ్చే బక్తులు మొత్తం 16 రోజులు దీక్షగా ఈ ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తరువాత ఈ డేట్ ఉన్న కొబ్బరికాయ తీసుకుని మొదటి రోజు కట్టిన కొబ్బరికాయను తీసుకుని కార్యసిద్ధి హనుమాన్ ముందు అందరినీ కూర్చోబెడతారు.
ఆ కొబ్బరికాయ స్వామీ వారికి చూపించి బక్తులకు తీర్ధ ప్రసాదాలు ఇచ్చి గోత్ర నామాలతో పూజ చేసి ఆ కొబ్బరికాయ వారికిచ్చి ఇంటికి వెళ్ళిన తరువాత ప్రసాదంగా స్వీకరించమని అక్కడి పంతులు గారు చెబుతారు ఇలా చేస్తే మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది.
Karya Siddhi Anjaneya Temple లో కొబ్బరికాయతో పాటు ఒక హనుమాన్ ఫోటో దాని ఎనుక Karya Siddhi Hanuman Mantram ఉంటుంది. దీనితో పాటు చేతికి ఒక తాడు కడతారు దీనిని 16 రోజులపాటు అలాగే ఉంచుకుని చివరి రోజు అక్కడ ఉండే బకెట్ లో వేసెయ్యాలి.
Karya Siddhi Hanuman త్రయోదశి పూజ
లంకలో హనుమంతుడు సీతమ్మను దర్శించిన రోజు మార్గశిర త్రయోదశి నాడు సీతమ్మ తల్లి దుఃఖం పోగొట్టిన రోజు కావిన సీతాదేవి ఈ రోజు ఎవరైతే నిన్ని పూజిస్తారో వారి కోర్కెలు నెరవేరతాయని సీతాదేవి హనుమంతునికి వరం ఇస్తుంది.

కావున మంగళ శని వారాలతో పాటు మార్గశిర త్రయోదశి లో వచ్చే హనుమద్వ్రతం ఇక్కడ అత్యంత విశేషంగా నిర్వహిస్తారు. స్వామివారికి తమాపాకుల దండలతో అలంకరించి స్వామి వారికి విశేష పూజలు చేస్తారు.

Karya Siddhi Hanuman Temple Story – కార్యసిద్ధి హనుమాన్ ఆలయం నిర్మాణ విశేషాలు
- ఈ కార్యసిద్ధి హనుమాన్ ఆలయాన్ని దత్త పీట అవధూత గణపతి శ్రీ సచ్చిదానంద స్వామీజీ చేతులమీదుగా ఈ ఆలయాన్ని 2015 లో జూలై 23 న ప్రారంభించారు.
- అయితే ఆగస్ట్ 1వ తారీకున ఆ రోజు ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా 40 వేల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మూడవ అతిపద్ద Hanuman Chalisa పారాయణం చేసిన ఆలయంగా Karya Siddhi Anjaneya Temple వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
- ఆంజనేయ స్వామీ ఎలాగైతే రాముని కార్యం నేరవేర్చాడో అలాగే తన బక్తుల కార్యం నెరవేర్చడంలో ముందుంటాడని ఇక్కడ బలంగా నమ్ముతారు.
- ఈ Karya Siddhi Anjaneya ఆలయంలోని విగ్రహాన్ని పది నెలల పాటు 18 మంది నిష్ణాతులైన శిల్పులు చెక్కారు.
- ఇక్కడ ఉన్నదీ ఏక శిలా హనుమంతుడు దీని బరువు 200 టన్నులు.
Karya Siddhi Hanuman Temple Timings
కార్యసిద్ది హనుమాన్ ఆలయం ఉదయం 06 గంటలనుండి మద్యాహ్నం 01 వరకూ తెరచి ఉంటుంది. మళ్ళీ 05 గంటలనుండి 09 గంటలవరకూ తెరిచి ఉంటుంది.
Karya Siddhi Hanuman Temple దర్శనం ద్వారా కలిగే ఉపయోగాలు
- జాబ్ కావాలనుకునే వారు
- కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే వారు
- సంతానం లేనివారు
- వ్యాపారంలో విజయం సాధించాలనుకునే వారు
- పిల్లల చదువు
- పెళ్లి కానివారు
- విదేశీ యానం
ప్రయాణంలో తలపెట్టిన కార్యం నెరవేరాలంటే ఈ గుడికి తప్పక వెళ్లి స్వామిని దర్శించుకోవాలి
Read Also..కేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath yatra
Read Also..Dakshinamurthy Stotram | అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి స్తోత్రం
Read Also..వరలక్ష్మి వ్రత విధానం… పాటించాల్సిన నీయమాలు | Varalakshmi Vratam