బుధవారం, జూలై 17, 2024
Homeసినిమాkalki 2898 ad trailer review : హాలివుడ్ రేంజ్ విజువల్స్ వండర్

kalki 2898 ad trailer review : హాలివుడ్ రేంజ్ విజువల్స్ వండర్

వైజయంతి మూవీ బెనర్స్ పై నాగ్ అశ్విన్ డైరెక్షన్లో టాలివుడ్ నుంచి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ Kalki 2898 AD (కల్కి) ఈ మూవీ నుండి తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఇన్నాళ్ళూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ను వెయిట్ చేయించిన నాగ అశ్విన్ కు ఈ ఒక్క ట్రైలర్ తోనే సమాధానం చెప్పేసాడని చెప్పొచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఇలాంటి హై-ఫై యాక్షన్ మూవీని టాలివుడ్ లోనే కాదు ఏకంగా ఇండియాలోనే ఇంత హై క్వాలిటీ హాలివుడ్ లెవెల్ అవుట్ పుట్ ఇప్పటివరకూ ఎక్కాడా చూడలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

kalki 2898 ad trailer review:

ట్రైలర్ స్టార్ట్ నుండి చివరి వరకూ కంటిన్యూస్ గూస్బంప్స్ వచ్చేవిధంగా ఉంది ట్రైలర్. ట్రైలర్ చూస్తె ఈ సినిమాలో యాక్షన్ తో పాటు నవ్వించే కామెడీ సీన్స్ కూడా మెండుగా ఉంటాయన్నది అర్ధమౌతుంది. అశ్వద్ధామ చెప్పే డైలాగ్ “నువ్వు ఇప్పుడు కనబోయేది మా ముందు ప్రాణం కాదమ్మ సృష్టి నేను కాపాడుతా” అనే డైలాగ్ అద్భుతంగా ఉంది.

హాలివుడ్ రేంజ్ విజువల్స్ వండర్ గా కల్కి

డైలాగ్స్ తో పాటు ప్రభాస్ గెటప్ మరియు డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ సూపర్ గా ఉన్నాయి. మిగతా కేరెక్టర్లలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాననాధం, కమల్ హాసన్ వంటి నటులు అద్భుతంగా సూటయ్యారు. ట్రైలర్ చివర్లో వచ్చే యాక్షన్ సీన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇక్కడ ప్రభాస్ చెప్పే డైలాగ్ లో ఆ అమ్మాయిని నేను తప్ప ఎవ్వరూ తీసికురాలేరు అనే డైలాగ్ చూస్తుంటే అశ్వద్దామ మరియు భైరవ కు మద్య ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది.

అశ్వద్దామ కేరెక్టర్ అదిరిపోయింది

ఇది నిజమైతే వీళ్ళ మద్య వచ్చే సీన్స్ కి గూస్బంప్స్ పక్కా అని అర్ధమౌతుంది. మొత్తం 3నిమిషాల ట్రైలర్ తో ఇంకా అనేక హింట్లు ఇచ్చాడు డైరెక్టర్. నిర్మాణ విలులల విషయానికి వస్తే 500 కోట్లకు తగ్గ ఫుల్ వసూల్ సినిమా అని చెప్పొచ్చు.

kalki 2898 ad trailer కి సూపెర్ రెస్పాన్స్

కల్కి 2898 AD ఈ సారి పక్కా భాహుబలి రికార్డ్స్ తుడిచిపెట్టేసేలాగే ఉంది. నేడు ఈ ట్రైలర్ ను ఆంధ్రా మరియు తెలంగాణా రాష్ట్రాలలో కొన్ని సెలక్ట్ చేసిన దియేటర్లలో ప్రేక్షకులకు ట్రైలర్ చూసే అవకాశం ఇచ్చారు చిత్ర యూనిట్. ట్రైలర్ చూసిన అభిమానులు హాలివుడ్ రేంజ్ విజువల్ వండర్ అంటూ కొనియాడుతున్నారు.

Read Also…ప్రభాస్ నీ మీద ఆశపెట్టుకోవడం దండగ… ప్రభాస్ ఫ్యాన్స్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular