బుధవారం, జూలై 17, 2024
Homeరాజకీయంజగన్ నీకేమైనా చిప్ దొబ్బిందా...శంఖారావం సభలో నారా లోకేష్ వ్యాఖ్యలు

జగన్ నీకేమైనా చిప్ దొబ్బిందా…శంఖారావం సభలో నారా లోకేష్ వ్యాఖ్యలు

రాప్తాడులో జరిగిన సిద్దం బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా  లోకేష్ శంఖారావం సభలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ పై మరియు వైసీపీ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు.

సిద్దం సభలో జగన్ ఫ్యాన్ ఇంటిలో ఉంటుందని సైకిల్ ఇంటి బయట ఉంటుందని గ్లాసు సింకులో ఉంటుందని వ్యాఖ్యలు చెయ్యగా దీనికి బదులుగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు 3000 ప్రభుత్వ బస్సులను వాడారని ఒక పార్టీ కోసం ప్రభుత్వ వ్యవస్థలను ఎలా వీడుతున్నారో ఇదొక ఉదాహరణ అని అన్నారు. అంతేకాక జగన్ సిద్దం సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటూ ఎందుకంటే ఫ్యాన్ ఇకపై ఇంటిలోనే ఉంటుందని ప్రజలు మిమ్మల్ని అదే ఫ్యాన్ కింద ఇంట్లో  కుర్చోపెడతారని మీరు హ్యాపీగా మీ ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకోవచ్చని అన్నారు.

సైకిల్ మీరు చెప్పినట్టే బయట ప్రజల మద్యలో ఉంటుందని ఎప్పుడూ ప్రజలతో ఉంటుందని అన్నారు. అంతేకాక గ్లాస్ సింక్ లో ఉన్నా అవసరం వస్తే దానిని తీసుకుని టీ తాగాల్సిందే అంటూ జగన్ వ్యాఖ్యలపై గంటా శ్రీనివాసరావు చురకలు అంటించారు. జగన్ చేస్టలపై లోకేష్ పలు విమర్శలు చేశారు నిన్న సిద్దం మీటింగులో ఒక వింత జరిగిందని మిట్ట మధ్యాహ్నం ఎండలో జగన్ మొబైల్ లోని టార్చ్ లైట్ ఆంచెయ్యమన్నాడని దీనితో కార్యకర్తలు జగన్ కి ఏమైనా రేచీకటి ఉందా లేక చిప్పు దొబ్బిందో అర్థంకాక వాళ్ళ కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు అన్నారు. అంతేకాక జగన్ నవ రత్నాల పేరుతో నవ మోసాలు చేశాడని విమర్శించారు.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular