మంగళవారం, జూన్ 18, 2024
HomeసినిమాKanguva: 10వేల మందితో సూర్య యుద్ధం.. కళ్ళు చెదిరే భారీ యాక్షన్ సీక్వెన్స్

Kanguva: 10వేల మందితో సూర్య యుద్ధం.. కళ్ళు చెదిరే భారీ యాక్షన్ సీక్వెన్స్

కోలివుడ్ నుండి అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ కంగువ తమిళ హీరో సూర్య నటిస్తున్న ఈ సినిమా నుండి వచ్చే ప్రతీ అప్డేట్ ఇప్పుడు అందరినీ మరింత ఎగ్జైటింగ్ కి గురుచేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో బాలివుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తుండడం మరియు ఈ సినిమాలో సూర్యా రెండు కేరెక్టర్లలో కనిపించబోతున్నాడు. ఇదిలాఉంటే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది.

Kanguva 10వేల మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ 

గతంలో కంగువ సినిమా నుండి వచ్చిన టీజర్ లో భారీగా యుద్ద సన్నివేశాలు ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో బాబీ డియోల్ మరియు సూర్య తో ఉన్న యుద్ధ సీక్వెన్స్ లో 10వేల మంది తో ఈ సీక్వెన్స్ తీసినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయి విజువల్ గా చూపించడం కోసం యుద్హం లో ఫైటర్స్ ని గ్రాఫిక్స్ లో కాకుండా మొత్తం 10000 మందితో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలిపారు.

ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న కంగువ మూవీ

దీనితో గ్రాఫిక్స్ తో పోలిస్తే ఆడియన్స్ కు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోగా ఇప్పుడు ఈ సినిమాపై పలు అప్డేట్లు ఇస్తూ ఈ చిత్రంపై మరింత అంచనాలు పెంచుతున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా జగపతి బాబు ఈ సినిమాలో కీలక కేరెక్టర్ లో నటిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular