బుధవారం, జూలై 17, 2024
Homeరాజకీయంజగన్ పై గుంటూరులో కేస్ ఫైల్ చేసిన రఘు రామ కృష్ణంరాజు

జగన్ పై గుంటూరులో కేస్ ఫైల్ చేసిన రఘు రామ కృష్ణంరాజు

ఒకపక్క టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో టీడీపీ ఉండి నియోజక వర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందిన రఘురామ కృష్ణం రాజు వైసీపీ కి భారీ షాక్ ఇచ్చారు. గతంలో ఆయన పుట్టినరోజు నాడు సీఐడీ అధికారులు ఆయనపై రాజద్రోహం తో సహా పలు సెక్షన్లతో కేసులు పెట్టి లాకప్ లో కస్టోడియల్ టార్చర్ చేసిన ఘటనలో ఇప్పటికే కేసులు నడుస్తున్నాయి. 

జగన్ పై గుంటూరులో కేస్ ఫైల్ చేసిన రఘు రామ కృష్ణంరాజు

అయితే నేడు  రఘురామ కృష్ణం రాజు నేడు టీడీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తనను పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేసిన అధికారులపైనా మరియు తనను టార్చర్ చెయ్యమని ప్రేరేపించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి పై చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ గారికి కంప్లయింట్ ఇచ్చారు రఘు రామ కృష్ణం రాజు.

తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న రఘు రామ కృష్ణంరాజు

గతంలో జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయం పై పోలీసులు సంప్లెయింట్ సైతం తీసుకోలేదని, చంద్రబాబు గారి పాలనలో లాండ్ ఆర్డర్ బాగా పనిచేస్తుందని కోర్టుకు వెళ్లాల్సిన అవసం లేదంటూ ఇక్కడే పోలీసులు కంప్లెయింట్ తీసుకుంటారని తాను కేస్ ఫైల్ చేసానని అన్నారు. కంప్లైంట్ లో తనను కస్టడీలో హింసించిన వారిని న్యాయపరంగా శిక్షించాలని ఆ కంప్లైంట్ లో ఇచ్చానని అన్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ ఎన్నికల్లో పరాభవంతో తలపట్టుకుంటుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డటైంది రఘు రామ కృష్ణంరాజు కేసు.

Read Also…కొడాలి నాని కబ్జా చేనిన భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్న టీడీపీ ప్రభుత్వం

Read Also…వైసీపీ ప్రభుత్వానికి చివరి రోజు కూడా కోర్టు మొట్టికాయలు

ReadAlso…జగన్ నీకేమైనా చిప్ దొబ్బిందా…శంఖారావం సభలో నారా లోకేష్ వ్యాఖ్యలు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular