ఆదివారం, జూలై 14, 2024
Homeసినిమాఅల్లూ అర్జున్ నువ్వేమైనా పోరాటాలు చేసావా ఆర్మీ అని చెప్పుకోవడానికి ...కిర్రాక్ ఆర్పీ

అల్లూ అర్జున్ నువ్వేమైనా పోరాటాలు చేసావా ఆర్మీ అని చెప్పుకోవడానికి …కిర్రాక్ ఆర్పీ

ఏపీ లో ఏలక్షన్ హడావిడి ముగిసినా దాని తాలూకూ చె దురు మదురు ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ కిర్రాక్ ఆర్పీ వ్యవహారం మరింత ముదురుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కెన్వర్సింగ్ సమయంలో నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేసిన శిల్ప రవి చంద్ర కిషోర్ కి సపోర్ట్ చేస్తూ అల్లూ అర్జున్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

అయితే కిర్రాక్ ఆర్పీ తాజాగా అల్లూ అర్జున్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా అల్లూ అర్జున్ ఫ్యాన్స్ కిర్రాక్ ఆర్పీ కి నీ అంతు చూస్తామంటూ చెప్పడంతో దీనికి స్పందించిన ఆర్పీ రాష్ట్రంలో అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటే అల్లూ అర్జున్ కు మాత్రం ఆర్మీ ఉందంట.

నాకు అసలు ఆర్మీ అంటే ఏంటో అర్థం కావడంలేదని దేశం సరిహద్దుల్లో శత్రు దేశాల నుండి మనల్ని కాపాడే వారిని ఆర్మీ అంటారు ఏంటి ఆర్మీని అల్లూ అర్జున్ ఆర్మీగా పీలౌ తున్నారని అన్నారు. అంతేకాక అల్లూ అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ అయినందుకు మాకూ గర్వమే కానీ వాళ్ళ ఫ్యాన్స్ ని ఆర్మీ అనడం ఒక చెత్త పని అని ఎందుకంటే అల్లూ అర్జున్ ఎలాంటి పోరాటాలూ చెయ్యలేదు అలాగే సమాజం కోసం ఫైట్ చెయ్యలేదని అన్నారు.

అంతేకాక తనకు వందల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇలాంటి వారిని ఆర్మీ అనాలా అంటూ వారిని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేస్తున్నావంటే నీ పతనం మొదలయ్యిందని అన్నాడు కిరాక్ ఆర్పీ. ఇదిలాఉంటే సాయిధరమ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ ఖాతా నుండి అల్లూ అర్జున్ ను అన్ ఫాలో చేశాడు.

Read Also…kalki 2898 ad trailer review : హాలివుడ్ రేంజ్ విజువల్స్ వండర్

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular