మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమాప్రభాస్ నీ మీద ఆశపెట్టుకోవడం దండగ... ప్రభాస్ ఫ్యాన్స్

ప్రభాస్ నీ మీద ఆశపెట్టుకోవడం దండగ… ప్రభాస్ ఫ్యాన్స్

గత రెండు రోజులుగా టాలివుడ్ మరియు బాలివుడ్ తో పాటు ఎక్కడ చూసినా ఒకటే రచ్చ దీనికి కారణం ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో తన లైఫ్ లోకి కొత్త వ్యక్తి వస్తున్నారని చేసిన పోస్టే కారణం ప్రభాస్ ఒక్క పోస్ట్ తో మొత్తం సోషల్ మీడియాను షేక్ చేశాడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫాంలలోనూ రెండు రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. అయితే నిన్న ఎదురుచూపులకు తెరదించుతూ కల్కి నుండి “బుజ్జి” ని పరిచయం చేస్తూ స్క్రాచ్ ఎపీసోడ్-4 ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు.

ప్రభాస్ నీ మీద ఆశపెట్టుకోవడం దండగ

ఫ్యాన్స్ మాత్రం పెళ్ల్లి కబురు చెబుతాడని అనుకోగా తన పెళ్లి మ్యాటర్ కూడా కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం వాడేశాడు ప్రభాష్. కల్కి నుండి అప్డేట్ రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా నిరాశపడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ ఇకపై నీ పెళ్లి గురించి ఆశలు పెట్టుకోవడం దండగ అంటూ నీపెళ్లికి మేము నీల్లోదిలెస్తున్నాము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై సోషల్ మీడియాలో పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ బ్రహ్మచారిగా ఉండు గాని ఆ అమ్మాయి మాత్రం వద్దు

ప్రభాస్ తన జీవితంలోకి కొత్త వ్యక్తి రాభోతున్నారు అనగానే దీనికి రెప్లై గా పాయల్ రాజ్ పుత్ పోస్ట్ చెయ్యగా ప్రభాస్ ఫ్యాన్స్ రిప్లై ఇస్తూ నువ్వు బ్రహ్మచారిగా ఉండిపో గాని రాజ్ పుత్ మాత్రం వద్దంటూ రిప్లై ఇస్తున్నారు. ఇక కల్కి నుండి కొత్తగా రిలీజ్ చేసిన వీడియోలో “బుజ్జి” అనే కేరెక్టర్ ను పరిచయం చెయ్యగా దీనికి హీరోయిన్ కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇప్పటికే కల్కి మూవీ నుండి ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు చిత్ర యూనిట్. ప్రమోషన్స్ అంటే బయపడే ప్రభాస్ ను ముదు ఉంచి భారీ స్థాయిలో ప్రమోషన్స్ కు ప్లాన్ చేస్తున్నారంట వైజయంతి మూవీ మేకర్స్. దేశ వ్యాప్తంగా పలు ఈవెంట్లకు కూడా ప్లాన్ చేస్తున్నారంట చిత్ర యూనిట్.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular