మంగళవారం, జూన్ 18, 2024
Homeరాజకీయంవైసీపీ ప్రభుత్వానికి చివరి రోజు కూడా కోర్టు మొట్టికాయలు

వైసీపీ ప్రభుత్వానికి చివరి రోజు కూడా కోర్టు మొట్టికాయలు

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజే చివరి రోజు ఎందుకంటే రేపు ఎన్నికల ఫలితాలు రానుండడంతో నేటితో జగన్ పాలనకు నేడే చివరి రోజు. అలంటి చివరి రోజు కూడా జగన్ ప్రభుత్వానికి ఘట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.

పూర్తి వివరాలలోకి వెళితే నేడు జగన్ ప్రభుత్వానికి ఒకటి కాదు ఒక్కరోజులోనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి మొదటిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ తెలిపిన విధానాన్ని తప్పుబడుతూ కొద్దిరోజుల క్రితం హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు కేసును కొట్టివేసింది తరువాత సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్ళడంతో సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై మేము జోక్యం చేసుకోలేమంటూ కోర్టు కేసును కొట్టివేసింది. దీనితో వైసీపీ ప్రభుత్వం పై పలు విమర్శలు వస్తున్నాయి.

జగన్ అడ్డగోలుగా రాజకీయ లాభం కోసం ఇలా కోర్టు కు వెళ్లి మొట్టికాయలు తినడం ఇదేమీ కొత్హ కాదంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక టీడీపీ కి పోస్టల్ బ్యాలెట్ లో భారీగా పోలయ్యాయనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడని మండిపడుతున్నారు.

ఇక వైసీపీ ప్రభుత్వానికి తగిలిన రెండో ఎదురుదెబ్బ అదికూడా సుప్రీం కోర్టు లోనే తాజాగా పిన్నెల్లి ఎలక్షన్ ఈవీఎం ను ద్వసం చేసిన ఘటనలో ఏపీ హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కి అనుకూలంగా పలు ఆంక్షలతో తీర్పు ఇస్తూ అతనికి బెయిల్ మంజూరు చేస్తూ 6వ తారీకు వరకూ అరెస్టు చెయ్యొద్దంటూ
ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తాజాగా పిన్నెల్లి తనను చంపెస్తాడని తనకు ప్రాణహాని ఉందంటూ నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టుకు వెళ్ళడంతో సుప్రీం కోర్టు ఈవీఎం ను ద్వసం చెయ్యడంపై తీవ్రంగా స్పందించింది.

ఒక ఎమ్మేల్యే వ్యక్తి ఈవీఎం ను ద్వసం చెయ్యడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు పిన్నెల్లి ఘటనలో ముందస్తు బెయిల్ ఇచ్చి పిన్నేల్లికి ఉపసమనం కలించడం ద్వారా హైకోర్టు తప్పు చేసిందని, ఇలా చెయ్యడం ద్వారా న్యాయాన్ని అపహాస్యం చేయ్యడమేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ కేసు ఘటనను వీడియోలో చూసిన సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుబడుతూ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో పిన్నెల్లి ఉండకూడదంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular