ఆదివారం, జూలై 21, 2024
HomeసినిమాPrabhas New Look: ప్రభాస్ లుక్ అదిరిపోయింది భాసూ

Prabhas New Look: ప్రభాస్ లుక్ అదిరిపోయింది భాసూ

వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నే కొత్త గెటప్ లో దర్శనమిచ్చాడు. తాజాగా సలార్ సినిమా ట్రైలర్ లాంచ్ వంటి కార్యక్రమాల్లో కూడా ప్రభాస్ కనిపించలేదు. అయితే నేడు ప్రభాస్ లేటెస్ట్ లుక్ తో దర్శన మివ్వడంతో ప్రభాస్ ఫాన్స్ ఆనందానికి అవదులులేకుండా పోయాయి.

ఎందుకంటే ప్రభాస్ గత సినిమాలలో కంటే బిన్నమైన గెటప్ లో కనిపించడమే ఇందుకు కారణం. తాజాగా కల్కి షూటింగ్ లో పాల్గొన్న డార్లింగ్ ప్రభాస్ కల్కి టీం సభ్యులతో పాటు నెట్ ప్లిక్స్ సీఈఓ “టెడ్ సేరండోస్” మరియు “మోనికా షెర్గిల్” ప్రభాస్ మరియు కల్కి టీం యూనిట్ కలిసి తాజాగా దిగిన ఫోటోలో ప్రభాస్  లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటివరకూ ప్రభాస్ ట్రై చెయ్యని ఫ్రెంచ్ స్టైల్ గెడ్డం మరియు గుబురు మీసాలతో అదిరిపోయే లుక్ లో ప్రబాస్ అందరినీ ఆకట్టుకున్నాడు.

అయితే గతంలో ప్రభాస్ కాలికి సర్జరీ సమయంలో యూరప్ వెళ్ళాడు చాలా రోజులు అక్కడే ఉండి సర్జరీ చేయించుకున్న తరువాత ఒక ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో రిలీజ్ చేసాడు అప్పుడు ఇదే ఫ్రెంచ్ స్టైల్ గెడ్డంతో కనిపించిన ప్రభాస్ ని చూసి అందరూ కాళీ దొరికింది కదా అని ట్రై చేసి ఉంటాడని అనుకున్నారంతా అయితే ఇదే స్టైల్ కల్కీ సెట్ లో చూసి షాక్ అయ్యారంతా.

దీనిని బట్టి ప్రభాస్ ఇదే స్టైల్ లో కల్కి సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఫోటోలో నెట్ ప్లిక్స్ సీఈఓ “టెడ్ సేరండోస్” ఎందుకు ఇక్కడికి వచ్చారనే విషయం బయటకు రాకపోయినా కొంత సమాచారం ప్రకారం నెట్ ప్లిక్స్ సీఈఓ “టెడ్ సేరండోస్” టాలివుడ్ లో పలు ప్రాజెక్టులు చేయ్యబోతునట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే కొందరు టాలివుడ్ హీరోలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీనిలో బాగంగానే ప్రభాస్ తో కూడా ఏమైనా భారీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్నారా అనే విషయం తెలియాలంటే కొంత సమయం వేచి చూడాలి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular