మంగళవారం, జూన్ 18, 2024
Homeజాతీయంబైకు పై నుండి వచ్చి హాలివుడ్ సినిమా రేంజ్ దోపిడీ ...వైరెల్ వీడియో

బైకు పై నుండి వచ్చి హాలివుడ్ సినిమా రేంజ్ దోపిడీ …వైరెల్ వీడియో

ముంభై హైవే పై జరిగిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తుంది. ఒకప్పుడు పలు రాష్ట్రాల్లో దారి దోపిడీ ఘటనలు చాలానే చూసాము అయితే తాజాగా ముంబై హైవే షాజాపూర్ మార్గంలో జరిగిన ఘటన యొక్క వైరెల్ వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఈ వీడియోలో హైవే పై భారీ లోడ్ తో వెళ్తున్న ఒక కంటేయినర్ పైకి వెనకనుండి డ్రైవర్ కి తెలియకుండా కంటేయినర్ పైకి ఎక్కి అక్కడి టర్పలిన్ కవర్ ను చింపి కంటేయినర్ లోపలినుంచి పేకింగ్ చేసిన ఒక బాక్స్ ను క్రిందకు పడవేశారు తరువాత ఆ ఇద్దరు కంటేయినర్ వెనకనుండి దిరేక్ట్ గా బైక్ పైకి ఎక్కి వెళ్ళిపోయారు.

తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరెల్ గా మారింది. ఏకంగా పట్టపగలే కంటేయినర్ పైకి ఎక్కి ఇలాంటి దొంగతనాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ విడీయో చూసిన నెటిజన్లు హాలివుడ్ సినిమా స్టంట్లు కూడా సరిపోవంటూ కామెంట్లు ఇస్తున్నారు. అయితే మొత్తం వ్యవహారం అంతా వెంకనుండి వస్తున్న ఒక కారు లోనుంచి వీడియో తీయడంతో ఈ విషయం వైరెల్ గా మారి చివరకు పోలీసుల వరకూ చేరింది. అయితే ఇప్పటివరకూ జరిగిన ఘటనపై పోలీసులకు ఎలాంటి పిర్యాదు అందలేదు.

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular