Dakshinamurthy Stotram గురించి తెలుసుకునే ముందు ఆది గురువు దక్షిణామూర్తి గుణగణాలను తెలుసుకుందాం ప్రధానంగా దక్షిణామూర్తి చాలా శాంత స్వరూపులు అసలు దక్షిణామూర్తి అనేపేరు దక్షిణం వైపు ఉండే మూర్తిగా కొందరికి తెలుసు అయితే దక్షిణామూర్తిలో దక్షిణము అనగా దాక్షిణ్యం ( సమర్ధత ) కురిపించే స్వామీ అనే అర్ధం కూడా వస్తుంది.
చాలా వరకూ దక్షిణామూర్తి ఫోటోను పరిశీలిస్తే ఆయన తత్త్వం చాలా వరకూ అర్ధమైపోతుంది. దక్షిణామూర్తిని చూడగానే ఆయన చిన్ ముద్రలో మర్రిచెట్టు క్రింద కూర్చిని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కి ఉండగా క్రింద ఋషులు కూర్చుని ఉంటారు. ప్రశాంతంగా కనిపించే స్వామి కుడివైపు చెవికి నాగాభరణం ఉండగా ఎడమవైపు చెవికి జగన్మాత యొక్క కర్ణాభరణం ఉంటుంది.
అపమృత్యు భయాన్ని తొలగించే Dakshinamurthy Stotram
దీనినిబట్టి అర్ధనారీశ్వర రూపంలో ఆ స్వామి భక్తులను ఆశీర్వదిస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రతీ ఒక్కరూ వెళ్ళే శివాలయాలలో దక్షిణ దిక్కు వైపు ఉన్న దక్షిణామూర్తిని ద్యానించడం చాలా మంచిది. దక్షిణం వైపు ఉన్న స్వామికి ఎదురుగా ఆప్రాంతంలో స్వామికి అభిముఖంగా కూర్చొని స్వామిని ద్యానించడం వళ్ళ అపమృత్యువు దరిచేరదు.
సాధారణంగా గురుగ్రహ దోషాలు ఉన్న వారు తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రం ప్రారాయణ చేయడం వల్ల వాళ్ళ గురు గ్రహ బలం కలుగుతుంది. దక్షిణామూర్తి ఆరాధనతో దుఖాలకు మూలమైన అజ్ఞానం అటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే స్వామియే దక్షిణామూర్తి.
Dakshinamurthy Stotram పారాయణం వల్ల అద్భుత ఫలితాలు
- దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అపమృత్యువు దరిచేరదు.
- దక్షిణామూర్తి స్తోత్రం పారాయణంతో అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని అందిస్తారు.
- కష్టాలకు ప్రధాన కారణం గురు గ్రహ భలం లేకపోవడం Dakshinamurthy Stotram ప్రతినిత్యం పారాయణం చేయడం వల్ల గురు గ్రహం బలం పెరిగి కష్టాలు, భాధాలూ తొలగడంతో పాటు జీవితంలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను నసింపజేస్తుంది.
- విద్యా బుద్దులు చేకూరాలనుకునేవారు తప్పనిసరిగా Dakshinamurthy ఆరాధన చెయ్యాలి
- జ్ఞానం కోరుకునే వాలకు జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని సైతం ప్రసాదించే స్వామి దక్షిణామూర్తి.
- దక్షిణామూర్తిని ఆరాదించే వారికి సంపదకు కొదవ ఉండదు.


దక్షిణామూర్తి యొక్క 16 రూపాలు – Dakshinamurthy names
- శుద్ధ దక్షిణామూర్తి
- మేధా దక్షిణామూర్తి
- విద్యా దక్షిణామూర్తి
- లక్ష్మీ దక్షిణామూర్తి
- సాంబ దక్షిణామూర్తి
- వటమూల దక్షిణామూర్తి
- వాగీశ్వర దక్షిణామూర్తి
- హంస దక్షిణామూర్తి
- లక్కుట దక్షిణామూర్తి
- చిదంబర దక్షిణామూర్తి
- వీర దక్షిణామూర్తి
- వీరభద్ర దక్షిణామూర్తి
- కీర్తి దక్షిణామూర్తి
- బ్రహ్మ దక్షిణామూర్తి
- శక్తీ దక్షిణామూర్తి
- సిద్ద దక్షిణామూర్తి
దక్షిణామూర్తిని ప్రధానంగా ఈ 16 అవతారాలలో కొలుస్తారు. Dakshinamurthy అవతారం ఒక్కరే అయినా భక్తులు మాత్రం అనేక మంత్రాలతో వారికి ఇష్టమైన రూపాన్ని కోస్తారు. దక్షినామూర్తిని ఆది గురువుగా పూజిస్తారు అయితే ఆ స్వామీ ఇతర గురువుల వాలే మాటలతో శిష్యులకు బోదించకుండా మౌనంగానే ఉండి శిష్యుల సందేహాలను నివృత్తి చేస్తారు.
Dakshinamurthy Avatharam – దక్షిణామూర్తి అవతారం
పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంబించినప్పుడు అతని యొక్క నలుగురి కుమారులైన సనక, సనందన, సంత్సుజాత లతో సృష్టిని కొనసాగించమనగా వారు సృష్టి కార్యం చేయడానికి విరక్తులై ఉన్న వారు బ్రహ్మతో ఈ కార్యం మేము నిర్వహించలేము ఎందుకంటే మేము బ్రహ్మజ్ఞానం పొందాలి అని అనుకుంటారు.
దీనితో వారు సరత్కుమారులు బ్రహ్మజ్ఞానం కోసం తీవ్రమైన తపస్సు చేసినా ఫలితం లేకపోవడంతో జ్ఞానం పొందాలంటే కశ్చితంగా గురువు కావాలి అని తెలుసుకుని వారు బ్రహ్మ వద్దకు వెళ్లి గురువుగా ఉండమని అడగడానికి వెళ్ళిన వాళ్లకు పక్కనే ఉన్న సరస్వతి దేవిని చూసి పెళ్ళిచేసుకుని సంసారంలో ఉన్న బ్రహ్మ ఇంకా మనకేం ఉపదేసిస్తాడని అక్కడి నుండి వెళ్ళిపోతారు.
తరువాత విష్ణుదేవుని వద్దకు తరువాత శివుని వద్దకు వెళ్లి వారి పక్కన ఉన్న లక్ష్మీ దేవిని, పార్వతి దేవిని చూసి మౌనంగా ఉండిపోతారు దీనితో పరమశివుడు వీళ్ళ అజ్ఞానానికి భాదపడి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకుంటాడు.
అయితే అక్కడినుండి ఆ నలుగురూ వెళ్ళిపోతుండగా ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చుంటాడు. అటుగా వెళ్తున్న ఈ నలుగురూ దక్షిణామూర్తిని చూస్తారు. ఒక్కసారిగా వారికి అద్భుతమైన తేజస్సుఉన్న ఆస్వామి కనిపిస్తారు
మేధా దక్షిణామూర్తి – Medha Dakshinamurthy
అయితే ద్యానంలో ఉన్న ఆస్వామిని చూసి ఆయన పాదాల చుట్టూ కూర్చొని ఆయన కళ్ళు తెరిస్తే బ్రహ్మజ్ఞానం గురించి అడాగాలని భావిస్తారు. అయితే ఆ స్వామీ కళ్ళు తెరిచి మౌనంగా వారివైపు చూడగా ఇంతలోనే ఆ నలుగురికీ Dakshinamurthy మాట్లాడకుండానే అజ్ఞానం తొలగిపోయి బ్రహ్మజ్ఞానం పొందుతారు. ఆ నలుగురికీ కావాల్సిన జ్ఞానోధయం అయింది అదికూడా పరమశివుడు మాట్లాడకుండానే జ్ఞానం లభించింది. అప్పటినుండి జ్ఞానాన్ని ప్రసాదించాడు కనుక దక్షిణామూర్తిగా కొలుస్తున్నారు.
దక్షిణామూర్తి ఎవరి అవతారం?
దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన స్వరూప అవతారం
కాలభైరవుడు, దక్షిణామూర్తి ఒక్కరేనా?
కాలభైరవుడు, దక్షిణామూర్తి వీరు ఇద్దరూ శివ స్వరూపులే అయితే కాలభైరవుడు శివుని యొక్క జటాజూటం నుండి ఉద్భవిస్తే దక్షిణామూర్తి సివిని యొక్క జ్ఞాన స్వరూపంగా అవతరించారు.
దక్షిణామూర్తి యొక్క రూపాలు మొత్తం ఎన్ని?
ప్రధానంగా దక్షిణామూర్తి రూపం ఒక్కటే అయితే భక్తులు కొలిచే స్వరూపాలు మొత్తం 16
దక్షిణామూర్తి మంత్రం చెయ్యాలంటే ఏమి చెయ్యాలి?
సాధారణంగా దక్షిణామూర్తి మంత్రానికి ఎలాంటి నీయమ నిభంధనలూ ఉండవు కాకపోతే దక్షిణామూర్తి బీజాక్షర మంత్రం మాత్రం ఎలా పడితే అలా సొంతంగా చెయ్యకూడదు దీనిని గురుముఖతా ఉపదేశం పొందాలి అలాగైతేనే ఈ మంత్రం సిద్దిస్తుంది.
మేధా దక్షిణామూర్తి ఎవరు?
దక్షిణామూర్తి అవతారాలలో విద్యా, బుద్దిని ప్రసాదించే దక్షిణామూర్తి అవతారమే మేధా దక్షిణామూర్తి
దక్షిణామూర్తి ప్రార్ధించడం వళ్ళ ఎలాంటి ఫలితాలు పొందవచ్చు?
ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చేసిన వారికి గురు బలం పెరిగి పాపల నుండి విముక్తులౌతాము. అంతేకాక బుద్ది, విద్యా, ధనం చేకూరతాయి.