సోమవారం, జూన్ 24, 2024
Homeభక్తివినాయక నిమజ్జనం లో కన్నీళ్లు పెట్టిస్తున్న బాలుడి వీడియో

వినాయక నిమజ్జనం లో కన్నీళ్లు పెట్టిస్తున్న బాలుడి వీడియో

వినాయక చవితి వచ్చిందంటే చిన్న వయస్సు నుండి పెద్ద వయస్సు వారిలో ఉండే ఉత్సాహమే వేరు. గణేషుని నామంతో ఊరూ వాడా కోలాహలంతో నిండిపోతాయి. పెద్దవారు పెద్ద విగ్రహాలను నిలబెట్టి వారి బక్తిని చాటుకుంటే చిన్నపిల్లలు ఆ గ్రామంలో ప్రజలు ఇచ్చే చందాలతో చిన్న విగ్రహాన్ని కొని పూజలు చేస్తుంటారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా తాజాగా ఉత్తర ప్రదేశ్ వ్రిందావన్ ధాం కు చెందిన అబినవ్ అరోరా అనే ఒక కుర్రాడు తాజాగా వినాయక చవితి వినాయకుని ప్రతిమను తీసుకుని తొమ్మిది రోజులు ఆ గణపయ్యకు పూజలు చేసాడు.

చివరికి వినాయకుని నిమజ్జనం చెయ్యాల్సిన సమయం రావడంతో దగ్గరలో ఉన్న కొలను వద్దకు ఏడుస్తూ తీసుకు వెళ్లి ఆక్కడ వినాయకునికి లడ్డూ తినిపించి అక్కడే గుక్కపెట్టి ఏడ్చేశాడు. ఇంతలో అక్కడ నిమజ్జనం చేసే సిబ్బంది వినాయకుణ్ణి తీసుకోగా వెక్కి వెక్కి ఏడుస్తూ తన గణేషున్ని నిమజ్జనం చేయ్యోధంటూ కోరగా వారు ఆ విగ్రహాన్ని తీసుకున్నారు.

వారిని బ్రతిమాలి వినాయక విగ్రహాన్ని తీసుకుని ఏడుస్తూ “స్వామీ నువ్వు మళ్ళీ త్వరగా తిరిగి వచ్చేయ్”
“ఓ మై ఫ్రెండ్ గణేశా నువ్వు లేకుండా నేను ఉండలేను” అంటూ స్వామిని తనివితీరా దగ్గరకు తీసుకుని ఏడ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్ అందరినీ ఎమోషన్ కు గురిచేసింది. దీనితో దేశంలో అన్ని చోట్లా వినాయక నిమజ్జనాలు ముగిసాయి అయినా ఈ కుర్రాడి బక్తికి అందరూ మెచ్చుకుంటున్నారు. మీరూ ఈ వీడియో చూడండి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకూ 29 లక్షల మంది వీక్షించారు.

Read Also..వరలక్ష్మి వ్రత విధానం పాటించాల్సిన నీయమాలు | Varalakshmi Vratam | Varalakshmi Vratham

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular