వాసవీ కన్యకా పరమేశ్వరి మాత గురించి పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల్లో తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. వైశ్యులు ఇలవేల్పు గా కొలిచే దేవతగా వాసవీ కన్యకా పరమేశ్వరి ని చెబుతారు. Vasavi Kanyaka Parameswari మాత కోలువొందిన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఈ అమ్మవారి క్షేత్రం ఉన్నదీ. ఈక్షేత్రాన్ని వారణాసి వైశ్యుల కాశి గా వాసవీ కన్యకా పరమేశ్వరి జన్మించిన పవిత్ర ప్రదేశంగా నమ్ముతారు. వారాహి దేవి మరియు పార్వతి దేవి అంశగా వాసవీ దేవిని పూజిస్తారు.
వాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర – Vasavi Kanyaka Parameswari Story
పూర్వం వేగినాడుని పరిపాలించే కుసుమశ్రేష్టి అనే రాజు మరియు అతని భార్య కుసుమాంబకు సంతానం లేరు వీరిద్దరికీ పిల్లలు అంటే ఎంతో ఇష్టం అయితే మా వంశంలో సంతానం కలగడానికి ఏదైనా మార్గం చెప్పండంటూ తమ గురువైన బాస్కరాచార్యుల వారిని ప్రార్ధించగా అప్పుడు వీరిని పుత్ర కామేష్టి యాగం చేయమని గురువు చెప్పడంతో యాగం చెయ్యగా ఆప్పుడు హోమ గుండం నుండి ఉమామహేస్వరీ దేవి యజ్ఞ ఫలంగా రెండు పళ్ళను ప్రసాదంగా ఇవ్వగా వీటిని సేవించగా కుసుమాంబ గర్భం దాల్చి ఇద్దరు సంతానాన్ని పొందుతుంది. అప్పుడు వీరిని దైవ ప్రసాదంగా బావించి అబ్బాయికి విరూపాక్షుడు అని అమ్మాయికి వాసవి అనే పేరుపెట్టారు.
వాసవిని చూసి ఎలాగైనా తననే పెళ్లిచేసుకోవాలనుకున్న విష్ణు వర్ధనుడు
వీరు ఇద్దరూ పెరిగి యుక్త వయస్సుకు వచ్చాక కుసుమశ్రేష్టి కొడుకుకి మరొక రాజ వంసలోని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే వాసవి మాత్రం ఎప్పుడూ ద్యానం, దైవ సన్నిధి లోనే ఎక్కువ కాలం గడుపుతుంది. అయితే రాజు అయిన విష్ణు వర్ధనుడు ఉత్సవాలకు నగరేశ్వర స్వామి దర్శనానికి అక్కడకు రావడంతో అదే సమయంలో నగరేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి వచ్చిన వాసవి ని విష్ణు వర్ధనుడు చూసి అందాల రాశిలా ఉన్న వాసవిని చూస్తూ ఆమె అందానికి ముగ్దుడైపోయిన విష్ణు వర్ధనుడు తన మంత్రితో పెనుగొండ వెళ్ళు అక్కడ కుసుమశ్రేష్టి ని కలిసి తన కూతురిని పెళ్ళిచేసుకోవడానికి అనిమతి తీసుకోవాలని మంత్రికి చెబుతాడు.
వాసవిని బలవంతంగానైనా పెళ్ళిచేసుకుంటానని హెచ్చరించిన రాజు
మంత్రి పెనుగొండ లోని కుసుమశ్రేష్టి ని కలిసి తమ రాజు విష్ణు వర్ధనుడు మీ కుమార్తె Vasavi Kanyaka Parameswari ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలపగా కుసుమశ్రేష్టి తాము వైశ్యుల కులానికి చెందిన వారమని క్షత్రియ కులం వారితో వియ్యం అందుకోలేమని చెప్పడంతో ఈ విషయాన్ని తన రాజు విష్ణు వర్ధనుడికి చెబుతాడు మంత్రి దీనితో కోపోద్రిక్తుడైన విష్ణు వర్ధనుడు వాసవి ని తాను బలవంతంగా నైనా లేక గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా సిద్దంగా ఉన్నట్లు చెప్పమని మంత్రిని మరొక సారి కుసుమశ్రేష్టి వద్దకు పంపుతాడు. ఈ విషయాన్ని కుసుమశ్రేష్టి కి తెలపగా తండ్రి కుసుమశ్రేష్టి అప్పుడుకూడా ఒప్పుకోడు.
పెనుగొండ గ్రామస్తుల నిర్ణయం
కుసుమశ్రేష్టికి ఏమిచెయ్యాలో పాలుపోక తన గురువైన బాస్కరాచార్యుల అనుమతితో అక్కడున్న మొత్తం 714 గోత్రాల ప్రజను ఒక చోటికి రమ్మనగా వారంతా సమావేశమౌతారు అయితే వీరిలో 102 గోత్రాల వారు రాజైతే ఏంటి అమ్మాయికి ఇష్టం లేకపోతే పెళ్లి చేసేది లేదని…వైశ్యుల పుత్రికను క్షత్రియ వంశీయులకు ఇవ్వకూడదని కులం యొక్క ఆచారాలు మీరకూడదని ఈ 102 గోత్రాల ప్రజలు చెబుతారు. మిగతా కులాల ప్రజలు మాత్రం రాజు అడిగినప్పుడు ఇవ్వకపోతే రాజు ఆగ్రహంతో మొత్తం గ్రామస్తులను అందరినీ చంపేస్తారు. గ్రామం మొత్తం రక్తపాతంతో నిండిపోతుందని బయపడతారు.
వాసవీ దేవి నదీ తీరంలో ఆత్మాహుతి
అయితే అక్కడకు వచ్చిన వాసవీ నావాళ్ళ ఎవరూ బాధపడకూడదు నేను ఆత్మాహుతి చేసుకుంటాను కాని వివాహం మాత్రం చేసుకోలేను అని గ్రామస్తులకు తెలుపడంతో మేము కూడా నీ తోనే ఆత్మాహుతి చేసుకుంటామంటూ ఆ 102 గోత్రాల ప్రజలు ముందుకు రావడంతో కుటుంబంలో అందరూ వద్దు ప్రతీ కుటుంబం నుండి ఇద్దరు దంపతులు రావాలను వాసవి చెబుతుంది.
గోదావరీ నదీ తీరం వద్ద బ్రహ్మ కుండం అనే పవిత్ర స్థలంలో వాసవీ తో సహా 102 కుండాలు ఏర్పాటు చేసుకుని ఆత్మాహుతి చేసుకోగా ఆ అగ్ని నుండి వచ్చే జ్వాలరూపంలో ప్రత్యక్షమై నాతొ పాటు ప్రాణ త్యాగం చేసిన మీరందరూ మోక్షాన్ని పొందుతారు. ఇకపై నేను మీ కుల దైవంగా ఉండి మీ క్షేమాన్ని నేను చూసుకుంటా, నన్ను ఆరాధించిన వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తానని వాసవి చెబుతుంది.
ప్రాణత్యాగం చేసిన గ్రామస్తులను వాసవీ దేవి నిజరూప దర్శనం
అయితే ప్రాణ త్యాగానికి ముందు 102 దంపతులు వాసవిని దైవాంశ గా బావించి వాసవిని నిజరూప దర్శనం ఇవ్వమని కోరగా దేదీప్యమాన వెలుగులతో ప్రత్యక్షమై నేను ఆది పరాశక్తి యొక్క ఆర్య మహా దేవి యొక్క అవతారాన్నని ఈ కాలంలో ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల యొక్క గౌరవం కాపాడండం కోసం, విష్ణు వర్ధనుడిని అంతం చేసేందుకు మరియు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి కలియుగంలో వసవిగా జన్మించానని చెబుతుంది.
పెనుగొండ గ్రామ పొలిమేరలో రక్తం కక్కుకుని చనిపోయిన విష్ణు వర్ధనుడు
విష్ణు వర్ధనుడు తన సైన్యాన్ని వెంటపెట్టుకుని పెనుగొండ గ్రామానికి వచ్చే సమయంలో పలు దుశ్శకునాలు సంకిస్తాయి పెనుగొండ గ్రామ పొలిమేర వద్దకు వచ్చేసరికి వాసవి తో పాటు గ్రామ ప్రజలు ఆత్మార్పణ చేసు చూసిన వికున్ష్ణునారని తెలియడంతో విష్ణు వర్ధనుడు నోటి నుండి రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. ఈ విషయం తెలిసిన విష్ణు వర్ధనుడి కుమారుడు రాజ రాజ నరేంద్రుడు హుటా హుటిన అక్కడికి వచ్చి అందరినీ క్షమాపణలు కోరతాడు.
Vasavi Kanyaka Parameswari Temple
ఇక ఈ Vasavi Kanyaka Parameswari దేవి ఆలయం యొక్క పూర్తి వివరాలలోకి వెళితే ఈ ఆలయం పెనుగొండ మండలం పెనుగొండ గ్రామం లోని ఈ అమ్మవారి ఆలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళితే అద్భుతమైన సుమారు 60 టన్నుల బరువు 90 అడుగుల ఎత్తు గల పంచలోహ విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది.

అమ్మవారు ఇక్కడ అగ్ని కిలలలో నుండి ఉద్భవించిన అమ్మవారిగా దర్శనమిస్తుంది. ఇంత భారీ ఎత్తైన విగ్రహం కోసం గర్భ గుడి యొక్క ఎత్తు 180 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఇంత ఎత్తైన విగ్రహం ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆలయ ప్రాంగానాన్ని వాసవీ శాంతి దామ్ అని పిలుస్తారు.ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది.
ఈ ఆలయంలో ప్రతిష్టించిన పంచలోహ విగ్రహంకోసం వాడిన లోహాలు
- రాగి : 42 టన్నులు
- జింకు : 20 టన్నులు
- తగరం : 1.3 టన్నులు
- వెండి : 600 కేజీలు
- బంగారం : 42 కేజీలు
మొత్తం 65 టన్నుల విగ్రహం (65 వేల కిలోల బరువు) అమ్మవారి పాదుకలు ఒక్కటే 1500 కేజీలు
ఈ ఆలయాన్ని 15-ఫిబ్రవరి 2019 న ఆవిస్కరించారు.
Vasavi Kanyaka Parameswari Temple Timings
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం Morning 06-00 AM to 12-00 PM Evening 03-30 PM to 08-00 PM
Read Also…కేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath yatra
Read Also…Dakshinamurthy Stotram | అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి స్తోత్రం