Saturday, July 4, 2020
Home భక్తి కేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath temple history

కేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath temple history

ఈ పుణ్య క్షేత్రాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి తప్పక మోక్షం కలుగుతుంది.”కేదార్‌నాథ్” అనే పేరుకు “క్షేత్ర ప్రభువు” అని అర్ధం: ఇది కేదర (“క్షేత్రం”) మరియు నాథ (“ప్రభువు”) అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. “విముక్తి పంట” ఇక్కడ పెరుగుతుంది కాబట్టి దీనిని కేదార్‌నాథ్ అని పిలుస్తారని  కాశీ కేదర మహాత్మ్య వచనం పేర్కొంది.

Kedarnath temple history:-

కేదార్‌నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని ఒక పట్టణం, కేదార్‌నాథ్ ఆలయం కారణంగా ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలోని నగర్ పంచాయతీ. నాలుగు చోటా చార్ ధామ్ సైట్లలో అత్యంత మారుమూలమైన కేదార్‌నాథ్ హిమాలయాలలో సముద్ర మట్టానికి 3,583 మీ (11,755 అడుగులు) దూరంలో ఉంది. మందాకిని నదికి మూలమైన చోరాబరి హిమానీనదం సమీపంలో ఉన్న ఇది మంచుతో కప్పబడిన శిఖరాలతో, ముఖ్యంగా కేదార్‌నాథ్ పర్వతం చుట్టూ ఉంది. సమీప రోడ్ హెడ్ గౌరికుండ్ వద్ద 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆలయ ప్రత్యేకత:

12 జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయం ఒకటి. కేదార్‌నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. హిమాలయాల్లోని చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఇక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత.  ఇక్కడ స్వామి ఆరు నెలలు మానవుల పూజలు అందుకుంటే ఇంకో ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారు. కేదార్‌నాథ్ స్థల పురాణం  గురించి తెలుసుకుందాం.. అసలు ఈ స్థల పురాణము వినడమే అధృష్ణం..  కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా ఈ నేపథ్యంలో కేదారేశ్వరుని శివలింగం గురించి వినే ప్రయత్నం చేయడం వలన మోక్షమార్గం త్వరగా లబిస్తుంది. 12 జ్యోతి లింగల్లో ఈ ఆలయం ఒకటి. దాదాపు 400 ల// సం//  మంచుతో కప్పబడి ఉంది.

అయితే ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే అంత మంచు తో ఉన్నపటికీ అక్కడ ఆ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఆ హిమాలయ పర్వతాల దగ్గర మహానుభావుడు ఆ కేదారేశ్వరిలో ప్రతిరోజూ కూడా ఆ నారాయణులు ఒక పార్థివ లింగాన్ని అక్కడ ఉంచి ఆ పార్థివ లింగాన్ని ఆరాధన చేస్తూ ఉండేవారు.  వారు చేస్తున్నది పార్థివ లింగానికే పార్థివ లింగం అంటే మట్టితో చేసిన శివ లింగం కానీ వాళ్ళు మేము  మట్టితో చేసిన శివలింగమే కదా అని అనుకునే వారు కాదు. ఇది ఈశ్వరుని ఈశ్వర స్వరూపం అని నమ్మారు. నమ్మి నర నారాయణులు అర్చనలు చేసేవారు.. అప్పుడు ఆ శివ లింగం నుండి పరమశివుడు ఆవిర్భవించి  పరవశించిపోయి ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో ఆ పార్థివ లింగానికి  మీరు చేసిన పూజలకి నేను ఎంతో సంతోషించాను మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అయితే అప్పుడు ఆ నర నారాయణులు ఇక్కడే  స్వయంభువు లింగ మూర్తిగా వెలసి లోకాలను కాపడమన్నారు. వారి కోరిక మేరకు స్వామి అక్కడ వెలిశారు.

బృష్టా భాగం శివలింగం:-

అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికమైన దృశ్యం ఎంటంటే… ఇక్కడ ఉండే శివలింగం అన్ని శివలింగాల్ల కాదు చాలా ప్రత్యేకంగా వేరేగా అన్నిటి కన్నా బిన్నంగా ఉంటుంది. అయితే ఈ శివలింగం ఎద్దు వెనక భాగం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో లింగం కనిపిస్తుంది. ఈ శివలింగం ఇలా ఎద్దు వెనక భాగం ల కనపడటానికి ఒక పురాణం కథనం ఉంది. కురుక్షేత్రం తర్వాత పాండవులు వాళ్ళ బందుజనాన్ని చంపిన పాపం నుంచి బయట పడడానికి వాళ్ళు కేదారేశ్వరుని దర్శించుకోవడనికి వెళ్లారు. అప్పుడు శివుడు ఆ పాండవులను పరీక్షించడానికి ఒక చిన్న మహిషం (దున్నపోతు) రూపములో అటు వైపు పరిగెత్తారు.. అపుడు ఆ పాండవులు ఆ మహిషాన్ని అటు వైపు వెళ్ళడం గమనించారు. ఇక్కడికి మహిషం ఎందుకు వచ్చింది. ఇది కచ్చితంగా ఆ పరమేశ్వరుడే అయి ఉంటాడు అని భావించారు. ఆ మహిషం కళ్ళు పట్టుకోవాలి అని ఆ మహిషం దగ్గరకు వెళ్ళారు . అయితే వాళ్ళకి కళ్ళు మాత్రం అందలేదు తోక అందింది . దాన్నే ఈశ్వర స్వరూపంగా భావించి తోక పట్టుకున్నారు పాండవులు. వాళ్ళ భక్తి కి మెచ్చిన పరమేశ్వరుడు తన బృష్ట భాగాన్ని అక్కడే విడిచి పెట్టి దానినే శివలింము గా మార్చేశాడట. అదే మనం ఇప్పుడు దర్శించుకుంటున్న కేదారేశ్వర లింగం.

ప్రయాణ సౌకర్యాలు:-

ఆ కేదరం వెళ్ళేటపుడు రోడ్డు కొన్ని కొన్ని నెలల్లోనే క్లియర్ చేస్తారు. ఇక్కడ రోజూ రాత్రుళ్లు 9 గం. కరెంట్ తీసేస్తారు. ఇంకా ఆ కార్టేజ్స్ లో చీకట్లోనే నిద్రపోవాలి.  గౌరీకుండ్ నుండి కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదార్‌నాధుని గుడి ప్రతిష్ఠితమై ఉంది. గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతం 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం. కేదార్‌నాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. 100 కు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పి పంపిస్తారు. అంత సమయం వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. ఇక్కడకు నడిచి ఎవ్వరూ వెళ్ళరు. ఎక్కడో బాగా తెలిసి ఉన్నవాళ్లు వెళ్తారేమో కానీ.. అంత సమయం వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది. ఇంకా ఉన్నవాళ్ళకి రెండే మార్గాలు.. ఒకటి డోలిలలో వెళ్ళడం రెండు గుర్రాల మీద వెళ్ళడం. డోలి లో కూడా అందరు వెళ్ళడానికి కుదరదు. అవి చాలా సున్నితం గా ఉంటాయి. వాటిపైన సన్నగా ఉన్నవాళ్లు ఎక్కుతారు వాళ్ళకి మాత్రమే ఆగుతుంది ఆ డోలి. మిగితా వాళ్ళు అంత గుర్రాల మీద వెళ్ళాలి.  ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 తీసుకుంటారు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది.

ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే..! రెండు గుర్రాల ను ఒక్కడే నడుపుతాడు. ఈ గుర్రాల మీద నుండి వెళ్తుంటే గుర్రం తిరిగేటపపుడు రోడ్డు అంచు దగ్గరకు వెళ్తుంది. ఒక్కసారి ఆ గుర్రం జారిందో వెతికే వాళ్ళు కూడా ఉండరు వెతికే సమస్య లేదు ఇంకా ఎందుకంటే కొన్ని వేల అడుగుల నుండి కింద పడిపోతాం.  అన్ని వేల అడుగుల నుండి కింద పడిపోతే అస్సలు ఎవ్వరూ బ్రతకరు. కెదరం లో పడడం అంటే కైలాసం వెళ్ళాడు అంటారు. కాబట్టి ఆ కేదారం వెళ్ళేటపుడు 10 రూ. ఇస్తే ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు disposable raincoat అది వేసుకొని ఆ గుర్రం వెక్కి వెళ్ళాలి .హోరున వర్షం కురుస్తుంది తడిచి ముద్ద అవుతాం వాన కురిసినా దిగడానికి ఉండదు. కేదరం వెళ్లి అక్కడి నుండి కిందికి దిగి వచ్చిన తర్వాత గుర్రం దిగిన వాడు నడుస్తుంటే అసలు వీడికి నడక వచ్చ అన్నటుగా అనిపిస్తుంది. ఆ గుర్రం మీద కదలిక కి వొల్లంత పుండ్లు అయిపోయి పులిసిపోయి నొప్పులు చేసేస్తుంది.

మామూలు వ్యక్తులెవ్వరికీ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. గుర్రం ద్వారా దాదాపు నాలుగు గంటల పాటు ప్రయాణం సాగుతుంది.  ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. కానీ తప్పనిసరిగా వెళ్లి తీరాల్సిన యాత్ర . కొన్ని వేల అడుగుల ఎత్తు అక్కడ మీరు పైనుండి కిందకు చూసారో కళ్ళు తిరుగుతాయి. ఇటునుండి రుద్ర ప్రయోగ అటు నుండి దేవ ప్రయోగ రెండు వెళ్లి కలుస్తాయి ఇక్కడ గంగా నది అక్కడ బదరీ లో అలకనంద నది రెండు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదుల చప్పుడులు పర్వతాల నుండి జలపాతాలు జారిపడుతూ ఉంటాయో.. దడ్ దడ్ దడ్ మంటు వచ్చేసి జలపాతం వినసొంపుగా ఉంటాయి. ఇన్ని వేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవలం కనపడుతూ ఉంటుంది. పరుగు పరుగున లోపలికి వెళ్తే  లోపల పెద్ద అంతరాలయం అక్కడ కేదారేశ్వరుని గా వెలిశారు ఆ మహానుభవుడు పరమేశ్వరుడు.

“కేదార శివలింగ దర్శనం చేసుకున్న వారికి మోక్షం కరత వామలకము” అని శివ మహా పురాణము నిర్ణయించేసింది. లేదా అల జరగాలని ఎవరు కొరుకోకుడదు కానీ కేదరమ్ వెళ్తుండగా పడిపోయిన వాడికి మోక్షం కలుగును. ఇది సత్యమే మోక్షం దొరుకుతుంది.

ప్రత్యక దర్శనం :-

ఇక్కడ ఆ కేదారేశ్వరుని దర్శనం కూడా ఒక పద్దతిలో చేసుకోవాలి అని చెప్తారు. కేదార లింగాన్ని నేరుగా చూడకుండా ఒక వలయంలో నుండి చూడాలని చెప్తారు. చేతికి వేసుకున్న కంకణం లాంటి ఒక గుండ్రటి రింగ్ లాంటి వస్తువు నుండి చూడాలని చెప్తారు.గర్భ గుడిలో కి ప్రవేశించ గానే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకొని అందులోనుండి స్వామిని దర్శించి ఆ తర్వాత మామూలుగా దర్శించుకోవాలి. ఇలా దర్శించుకోవడాన్ని అంతర ద్వారము గుండా ఆ శివుడిని దర్శించుకోవడం అని ప్రతీకగా చెప్తారు. అలా చూసిన కంకణన్ని అక్కడే వదిలి పెట్టి వచ్చేయాలి అని చెప్తారు.

కేదారేశ్వరుని లింగానికి నెయ్యి రాసి మొక్కుకుంటే వాళ్ళ పాపాలు పోయి కోరికలు తీరతాయి అని వాళ్ళ నమ్మకం. కేదారేశ్వరుని మహత్యం గురించి చెప్తూ ఈ విషయన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడే ఒకసారి పార్వతి దేవికి చెప్పాడట. అలా శివ లింగానికి నెయ్యి రాసి కోరికలని కోరడానికి ఒక పురాణ కథనం ఉంది. ద్వాపర యుగంలో పాండవులు మహిషం రూపంలో ఉన్న శివుని వెనక తోక పట్టుకుని లాగడంతో బృష్ఠ భాగం అంతా కమిలి పోయిందట. అప్పుడు ఆ కమిలి పోయిన బృష్ఠా భాగానికి నెయ్యి రాసి సేద తీర్చారు. అందుకే స్వామికి నెయ్యి రాసి నేతితో అభిషేకం చేయడం ఆనవాయితీగా మారింది. అలా అభిషేకం చేసిన నెయ్యిని ప్రసాదం గా ఇంటికి తెచ్చుకుంటే ఇంటికి శుభం కలుగుతుంది అని చెప్తారు. మన శరీరంలో ఎలాంటి నొప్పులు ఉన్న అక్కడ ఆ నెయ్యి ని రాస్తే ఆ నొప్పి నుండి విముక్తి కలుగుతుంది.

కేదార్‌నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఆ తర్వాత ఆరు నెలలు మూసి ఉంచుతారు. ఆ సమయంలో దేవతలు ఆ కేదారేశ్వరుని పూజిస్తారు.

వాతావరణ మార్పు మంచు కారణంగా శీతాకాలంలో కేదార్‌నాథ్ ఆలయం మూసివేయబడుతుంది. ఆరు నెలలు, నవంబర్ నుండి ఏప్రిల్ వరకు, కేదార్‌నాథ్ యొక్క ఉత్సవ మూర్తి (విగ్రహం) తో ఉన్న పాల్కీని గుప్తాకాషికి సమీపంలో ఉన్న ఉఖిమత్ అనే ప్రదేశానికి తీసుకువస్తారు. పూజారులు మరియు ఇతర వేసవి కాల నివాసితులు కూడా తమ ఇళ్లను సమీప గ్రామాలకు తరలిస్తారు. 55 గ్రామాలు మరియు సమీపంలోని ఇతర గ్రామాలకు చెందిన తీర్థ పురోహిత్ యొక్క 360 కుటుంబాలు జీవనోపాధి కోసం కేదార్‌నాథ్‌పై ఆధారపడి ఉన్నాయి.

 

ప్రజావారధిhttps://www.prajavaradhi.com/
పాటకులకు ముఖ్య్యంగా తెలుగు ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉండాలని రూపొందించిన వెబ్ సైట్ ప్రజావారధి డాట్ కాం. గత కొంతకాలంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా తగ్గిపోతుంది కావున మళ్ళీ తెలుగుకు పూర్వవైభవం రావాలనే ఆశతో మా ఈ చిన్న ప్రయత్నం. ఇందులో తెలుగు ప్రజలకు ఉపయోగపడే ముఖ్య సమాచారంతో పాటు రాజకీయ వార్తలు, దేశ, విదేశీ వార్తలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రతీ మనిషికీ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే హెల్త్ టిప్స్ మరియు క్రీడావార్తలు అన్నివయస్సుల వారికీ ఉపయోగపడే భక్తి సమాచారం ఈ వెబ్ సైట్ మీకు అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ప్రముఖ బాలివుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71)ఇకలేరు. గుండె పోటుతో శుక్రవారం తెల్లవారజామున కన్నుమూశారు. 15 రోజుల క్రితం అనారోగ్యానికి గురైనా కారణంగా జూన్ 20 నీ ముంబయి లోని బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో...

జగన్నాథ రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్-Puri Jagannath Rath Yatra

ఒడిశాలోని జరిగే పురి జగన్నాథుని రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొన్ని రోజుల క్రితం ఆలయ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు కొన్ని నిబంధనలతో రథయాత్ర జరుపుకోవచ్చని...

భారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

భారత్ ఒకవైపు చైనాతో బోర్డర్ లో పోరాడుతుంటే మరోవైపు పాకిస్థాన్ వెనకనుండి దొంగ దెబ్బ తీయడానికి ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తుంది. తాజాగా భారత్ –చైనా దేశాల మద్య బోర్డర్ లో ఉద్రిక్తతలు మొదైలైన...

కరోనా తో మరణించిన వ్యక్తిని జేసీబీ లో తీసుకెళ్ళిన ఘటన

కరోనా మహమ్మారి దెబ్బకు కరోనా సోకిన వారిని వారు బంధువులైనా మరెవరైనా సరే వారిని దూరం పెట్టిన ఘటనలు చాలానే చూసాం. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే...

Recent Comments