శుక్రవారం, మార్చి 29, 2024
Homeరాజకీయంరాజధానుల పట్టికలో అమరావతి ప్లేస్ లో విశాఖను రాజధానిగా చూపిస్తున్న కేంద్రం

రాజధానుల పట్టికలో అమరావతి ప్లేస్ లో విశాఖను రాజధానిగా చూపిస్తున్న కేంద్రం

ఏపీ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలుపుతూ అందరినీ షాక్ కి గురిచేసింది. తాజాగా కుంభకుడి సుధాకరన్ అనే వ్యక్తి కేంద్రానికి ఒక లేఖ వ్రాసారు ఆ లేఖలో పెరిగిన పెట్రోల్ రేట్ల ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఎంతుందో అంచనా వేసారా అంటూ కేంద్రానికి లేఖ వ్రాయడంతో దీనికి బదులుగా ప్రధాన నగరాలలో పెరిగిన రేట్లను కేంద్రం అంచనా వేస్తూ ఒక జాబితాను పంపించింది. అయితే కేంద్రం విడుదల చేసిన లేఖలో ఏపీ రాజధాని అనే పేరు వద్ద విశాఖ అంటూ ఉండడంతో ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది.

గతంలో పలుమార్లు రాజధాని విషయంలో మాట మార్చిన కేంద్రం ఒకసారి రాజధాని అమరాతి అంటూ మరోసారి మూడు రాజదానులంటూ మరోసారి రాష్ట్ర రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర పరిదిలో విషయం అంటూ అది వారికే వదిలేస్తున్నాం అంటూ కోర్టులకు సైతం ఇదే మాట చెబుతూ వస్తోంది. ప్రస్తుతం రాజధాని విషయం కోర్టులో ఉండగా ఇప్పటివరకూ చెప్పని కేంద్రం రాజధాని విశాఖను ఎలా నిర్ధారిస్తుందని రాజధాని వాసులు ప్రశ్నిస్తున్నారు.  

ప్రస్తుతం కేంద్రం రాజధాని జాబితాలో వైజాగ్ ను చేర్చడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఒకవేళ ఈ విషయం పొరపాటున జరిగిందా లేక కేంద్ర వైఖరిని నిర్ధారిస్తూ ఈ లేఖ ద్వారా తెలిపిందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం నేడు కేంద్రం రాజధానిని విశాఖ అంటూ తెలపడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చందవండి…

  1.        మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం .. బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు
  2.        ఎయిర్ పోర్ట్ లో సల్మాన్ కి చేదుఅనుభవం.. సల్మాన్ ని అడ్డుకున్న CISF జవాన్
  3.        ఇండియా టుడే సర్వేలో భూతద్దంలో పెట్టి వెతికినా దొరకని జగన్ పేరు… 11 శాతానికి                       పడిపోయిన జగన్ గ్రాఫ్
WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular