ఇండియాలో ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని భారీ యాక్షన్ సీన్స్ తో సలార్

0
996
salaar movie update
salaar movie update

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున సలార్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న సలార్ టీమ్ తాజాగా ముంబై లో కొత్త షెడ్యూల్ ఈ నెల 11వ తారీకు నుండి స్టార్ట్ చేసిన చిత్ర బృందం తాజా షెడ్యూల్ లో పూర్తి స్థాయి భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సలార్ షూటింగ్ కి సంబందించి యాక్షన్ సీన్స్ లో పాల్గొన్న హిందీ ఆర్టిస్టులు ద్వారా కొన్ని విషయాలు బయటకొచ్చాయి. వాటిలో ఇప్పటివరకూ షూట్ చేసిన మూడు సెడ్యూల్లల్లో ఎనబై శాతం షూటింగ్ ఇప్పటివరకూ ఇండియాలో కనీ వినీ ఎరుగని భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్లు చెబుతున్నారు.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే మూడు రోజుల పాటు ముంబైలోని తన షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది అక్కడి నుండి బ్రిటన్ వేల్లాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్ ల కారణంగా అధిక బరువు, బాడీ డిటాక్స్ వంటి సమస్యల కారణంగా భాడీ చెకప్ కొరకు యూకే వెళ్లారని బాలివుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ వేచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది.

WhatsApp Group Join Now