Varalakshmi Vratam : ప్రతీ సంవత్సరం వచ్చే శ్రావణమాసం ప్రతీ మహిళకూ చాలా ముఖ్యమైనది. సంవత్సరమంతా ఇంటిల్లపాదీ సుఖ-సౌఖ్యాలతో తులతూగాలంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతాన్ని భక్తీ, శ్రద్దలతో ఆచరించడం ద్వారా ఆ ఇంటిలో ధనానికి, సౌభాగ్యాలకూ, ఆయురారోగ్యాలు చేకూరతాయి. వరాలను ప్రసాదించే ఆ తల్లి వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించేవారు ఎలాంటి నీయమాలు కానీ నిష్టలు కానీ అవసరం లేకుండానే లక్ష్మీ దేవి మీద పూర్తిగా మనస్సును లగ్నం చేసి ద్యానించాలి.
వరలక్ష్మి వ్రత విధానం
ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముందుగా ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటి వకిట్లో ఆవు పేడతో కళాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలి. తరువాత ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. ఇక ఇంట్లో మనం ఎక్కడైతే కలశం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుద్ధి చెయ్యాలి అనగా గోమయం తో భూమిని శుద్ది చెయ్యాలి. తరువాత పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మండపం మీద బియ్యపు పిండితో ముగ్గు వేసి ఆ మండపాన్ని పసుపు కుంకుమలతో ఆలంకరించుకోవాలి.
దీనిపై జాకెట్ వస్త్రాన్ని దానిపై వేసుకోవాలి దీనిపై అమ్మవారి ఫోటో పెట్టాలి. కలశం పెట్టుకునే వాళ్ళు మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని పీటంపై వేసి దానిమీద తమలపాకు ఉంచి ఎవరికి వారు వారికి తగిన స్తోమతతో బంగారు, వెండి లక్ష్మీదేవి ప్రతిమను పెట్టుకోవచ్చు అంత స్తోమత లేని వారు కలశాన్ని పెట్టుకోవాలి.
Varalakshmi pooja కు కలశం పెట్టుకునే విధానం
సుభ్రంచేసిన ఒక రాగి చెంభు తీసుకుని దానికి పసుపు రాసి దానికి కుంకుమతో బొట్లు పెట్టాలి. తరువాత మూడు లేదా ఐదు వరుసల తెల్ల దారం తీసుకుని దానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్ముని తీసుకుని దానిపై మామిడాకు చుట్టి వాటిని దారంతో కట్టి కలశానికి కట్టాలి. తరువాత రాగి చెంభు లో నీళ్ళు తీసుకుని దానిలో కుంకుమ, పసుపు, గంధం, అక్షింతలు, పొక్క, కర్జూరం, వెండి తామర పువ్వు, తామర గింజ, లక్ష్మీ గవ్వలు, గోమతీ చెక్రాలు, చిల్లర డబ్బులు ఆ కలశంలో వెయ్యాలి.
తరువాత ఆ కలశం పై ఒక ఐదు మామిడాకులు లేదా తమపాకులు పైన ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన కొబ్బరికాయను ఎరుపు జాకెట్ వస్త్రాన్ని గోపురం ఆకారంలో చుట్టి దానికి స్వస్తిక్ సింబల్ రాసి దానిని కలశం మీద పెట్టిన కొబ్బరికాయపై పెట్టాలి దీనితో కలశం పెట్టె విధానం పూర్తి అవుతుంది. తరువాత మండపం పైన రెండు దీపపు కుందెలను పెట్టి వాటిలో స్వచ్చమైన ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె తో ఒక్కొక్క దానిలో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. తరువాత అమ్మవారికి పసుపు కుంకుమతో కట్టిన తాళిని ఏర్పాటు చేసుకొని ఆ కలశంపై ఉన్న అమ్మవారికి వెయ్యాలి.

తోరం ఎలా తయారు చేసుకోవాలి?
ఒక తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులుగా తీసుకుని ఆ తొమ్మిది పోగుల దారానికి పసుపు రాయాలి. తరువాత ఆ దారానికి వరుసగా ఐదు లేక తొమ్మిది పువ్వులు కట్టి ముడులు వెయ్యాలి. అంటే ఐదు పోగుల దారానికి ఐదు ముడులు లేక తొమ్మిది పోగుల దారానికి తొమ్మిది ముడులతో పువ్వులు కట్టి తోరాన్ని తయారుచేసి, దాన్ని పీఠం వద్ద పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షతలు వేస్తూ పూజించాలి ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత ఈ క్రింద ఇచ్చిన మంత్రాలతో తోరాన్ని పూజ చెయ్యాలి.

Varalakshmi Vratam pooja సామగ్రి
- వరలక్ష్మి దేవి ఫోటో (కూర్చుని ఉన్న ఫోటో )
- పసుపు
- కుంకుమ
- గాజులు-12
- గంధం
- తమలపాకులు-ఒక మోదు
- వక్కలు-100గ్రా..
- ఖర్జూరం-20గ్రా..
- అగరబత్తులు-1పేకెట్
- టెంకాయ
- పూలు
- పూల దండలు
- అరటి పళ్ళు-ఒక డజను
- అక్షింతలు
- ఆవు పాలు -25ఎం.ఎల్
- గంట
- ముద్ద కర్పూరం
పైన చెప్పిన విధంగా సామాగ్రి సిద్దం చేసుకున్నాకా ముందుగా ఒక పళ్ళెం తీసుకుని తరువాత మంచినీళ్ళ గ్లాసు తో మూడు సార్లు కుడి చేతిలో ఆ నీళ్ళను పోసుకుని ఆ నీళ్ళని త్రాగాలి. తరువాత చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకుని ఆచమన మంత్రాలు చదువుతూ ఆ నీటిని పళ్ళెంలో విడిచిపెట్టాలి. తరువాత చేతి లోకి కొన్ని అక్షింతలు తీసుకుని భూసుద్ది మంత్రాన్ని చెప్పి వాటిని ఎడమవైకు ఆ అక్షింతలను విడిచిపెట్టాలి.
తరువాత కొన్ని అక్షింతలు తీసుకుని మన సంకల్పాన్ని చెప్పుకోవాలి తరువాత చేతిలోని అక్షింతలను అమ్మవారి దగ్గర విడిచి పెట్టాలి. ఇక అమ్మవారి దగ్గర పెట్టిన కలశంలో నీటిని సుద్ది చేయడానికి ఆ కలశంపై చేతిని ఉంచి మంత్రాన్ని చెప్పడం ద్వారా కలశంలోని జలం శుద్ధి అవుతాయి.
Varalakshmi Vratham చేసే ముందు గణపతి పూజ – Ganapathi Pooja
ఎలాంటి వ్రతానికైనా, పూజకైనా ముందుగా ప్రార్ధించాల్సింది ఆది దేవుడు గణపతి దీనికి గాను పసుపుతో కూడిన గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఆప్రతిమను తమలపాకులో అక్షింతలు వేసి దానిపై వినాయకుడిని పెట్టాలి. తరువాత ఆ వినాయకునికి పూలు అలంకరించాలి. ఇక ఈ Varalakshmi Vratam చేసే ముందు వ్రతానికి సంబంధించిన సామాగ్రి మొత్తం సిద్దం చేసుకోవాలి.
ఈ క్రింది ఇచ్చిన Varalakshmi Vratham కథ చదవాలి


పైన తెలిపిన విధంగా వరలక్ష్మి వ్రత కథ చదివి చేతోలోని అక్షింతలు అమ్మవారి దాగ్గర కొన్ని వేసి మిగిలినవి శిరస్సుపై వేసుకోవాలి.
Questions & Answers
Q. గర్భవతులు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా?
A. ఈ వ్రతం వచ్చిన నాటికి గర్భవతులకు ఐదవ నెల వచ్చే లోపు వరకూ ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. ఐదు నెలలు దాటిన తరువాత వస్తే ఆఇంట్లో తన అత్తగారు, తోటికోడలు పూజ చేస్తే ఆ పూజలో ఆ అమ్మాయి తోరాన్ని లక్ష్మీ దేవి వద్ద పెట్టి అర్చన చేసి ఆ అమ్మాయికి ఇవ్వాలి అంతేగాని పూజ చేయడం, దీపారాధన, కొబ్బరికాయ కొట్టడం వంటివి చేయరాదు.
Q. వరలక్ష్మీ వ్రతం అన్ని శుక్రవారాలు చెయ్యాలా లేదా ఒక్క శుక్రవారం చేస్తే సరిపోతుందా?
A. వరలక్ష్మీ వ్రతం అనేది పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారమే చేసుకోవాలి. గృహస్తు ఇంటిలో మైలు గాని అసౌచికం గాని ఉంటే తరువాత వచ్చే శుక్రవారం చేసుకోవాలి. ఇక ఆన్ని వారాలూ చెయ్యాలి అనేవి ఎక్కడా నిర్ధారించబడలేదు.
Q. Varalakshmi Vratam లో కలశం తప్పని సరిగా పెట్టాలా లేక విగ్రహం పెడితే సరిపోతుందా?
A. వరలక్ష్మీ వ్రతంలో ప్రధానంగా కలశం పెట్టుకోవడం ఉత్తమం ఎందుకంటే ఆకలశం లో మనం వేసే జలంతో ఆ దేవిని పూజిస్తున్న్నాం కనుక కలశం ఏర్పాటు చేసుకోవడం మంచిది.
Q. వరలక్ష్మీ వ్రతం నాడు వాయనం బ్రాహ్మణులకు ఇవ్వాలా లేక ముత్తైదువులకు ఇవ్వాలా?
A. Varalakshmi Vratam కథలో చెప్పిన విధంగా వాయనం అనేది మనకు వరలక్ష్మీ వ్రతం కథ ఆచరింపజేసినా బ్రాహ్మణులకు వాయనం ఇవ్వాలి. ఇక వ్రతం చేసిన వారు ముత్తైదువులతో కలిసి వ్రతం చేసిన గదిలో 9 ప్రదక్షిణలు చెయ్యాలి.
Read more…
- బోనాల సంభారాలతో కళకళ లాడుతున్న భాగ్యనగరం | Bonalu 2021
- కేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath yatra