శుక్రవారం, జూలై 26, 2024
Homeరాజకీయంyarlagadda venkata Rao : వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరిన యార్లగడ్డ

yarlagadda venkata Rao : వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరిన యార్లగడ్డ

గన్నవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ yarlagadda venkata Rao గత రెండు మూడు రోజులుగా తనకు టికెట్ కన్ఫామ్ చెయ్యాలనే విషయంపై వైసీపీ నేతలు, కార్యకర్తల సమీవేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మీటింగ్ లు పెట్టి జగన్ ను తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకూ యార్లగడ్డ కు అపాయింట్మెంట్ కాదు కదా ఒక్క పోన్ కాల్ కూడా చెయ్యని తరుణంలో ఇప్పటికే ఎన్నికల సమయం తరునిస్తున్న సమయంలో యార్లగడ్డ వెంకట్రావ్ నేడు జరిగిన కార్యకర్తల సమావేశంలో తన స్టాండ్ ను బహిర్గతం చేసేశారు.

ఇప్పటి వరకూ పార్టీకి కష్టపడి పనిచేశానని అన్నారు గన్నవరం టీడీపీ కి కంచుకోటలాంటిదని అలాంటి చోటు పది మంది నేతలు కూడా లేని చోట వైసీపీ ని ముందుండి నడపించడానికి చాలా కష్ట పడ్డానని తన కష్టాలు ప్రజలకు చెప్పుకునే వ్యక్తిని నేను కాదన్నారు.

తాను ఎంతకష్టపడ్డా ఒక పెయిల్ అయిన వ్యక్తి లాగే నన్ను చూసారని గడప పడపకూ ప్రోగ్రామ్ లో కాళ్ళు అరిగేలా తిరిగానని తన కార్యకర్తల కాళ్ళు అరిగేలా తిప్పనన్నారు. తనకు ఇచ్చిన ఒక ఒక పని సక్రమంగానే చేశానన్నారు తనను ఇచ్చిన కృష్ణా జిల్లా కోపరేటీవ్ సెంట్రల్ బ్యాంక్ ను తాను అభివృద్ది పథంలోకి తీసుకెళ్ళి దేశంలోనే రెండవ స్థానంలో నిలిపిన తరువాత దేశం మెచ్చింది కానీ వైసీపీ మెచ్చలేదని అన్నారు. వాళ్ళ మెప్పు ఎందుకు పొందలేకపోయానో తెలియట్లేదన్నారు.

టీడీపీ నుండి గెలిచి వైసీపీ కి వచ్చిన వారే వైసీపీ బలమా అంటూ తనను వైసీపీ నాయకులే చిచ్చుపెట్టిన  పొమ్మనలేక పోగపెడుతున్నారని అన్నారు. ఇప్పటిదాకా చంద్రబాబు, లోకేష్ గారిది గానీ అపాయింట్మెట్ తీసుకోలేదని కానీ నేను మీకు పనికొస్తానని అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ వెంటనే ఇవ్వాలని బహిరంగంగా తాను టీడీపీ లోకి వెళుతున్నట్లు తెలిపారు.

ఒకవైపు గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీ లోకి వెళ్ళిన తరువాత అక్కడ సరైన నాయకుడు లేక ఇబ్బంది పడుతున్న తనునంలో యార్లగడ్డ వెంకటరావు టీడీపీ లోకి రావడం అక్కడ టీడీపీ కి కొండంత బలం చేకూరింది.

అయితే చంద్రబాబు యార్లగడ్డ కు తప్పకుండా టీడీపి లోకి ఆహ్వానం కన్ఫాం అంటూ అయితే మరో రెండు రోజుల్లో లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా గన్నవరంలో జరిగే భారీ బహిరంగ సమావేశంలో టీడీపి గన్నవరం అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు ను ప్రకటిస్తారని తెలుస్తోంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular