బుధవారం, జూలై 17, 2024
Homeజాతీయంమూడవ విమాన వాహక యుద్ద నౌక తయారీకి భారత నేవీ సన్నద్ధం

మూడవ విమాన వాహక యుద్ద నౌక తయారీకి భారత నేవీ సన్నద్ధం

భారత నేవీ అమ్ముల పోదిలోకి శత్రు దుర్భేద్య స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ INS Vikrant తయారీకి మరొక సారి అడుగులు వడి వడిగా పడుతున్నాయి. ఇప్పటికే నేవీ అమ్ములపొదిలో స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్ ఉండగా భారత నేవీ అవసరాలు బట్టి మరొక ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక తయారీకి నేవీ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ముంభై లో అధునాతన టెక్నాలజీ తో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి లాంచ్ చేసిన సందర్భంగా చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ మాట్లాడుతూ మేము మరొక విమాన వాహన నౌక INS Vikrant తయారీకి కృషి చేస్తున్నామని అన్నారు. అంతేకాక ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మునుపటి INS Vikrant లాంటిదే మరొకటి నిర్మిస్తామని అన్నారు.

తమకు ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మించడంలో చాలా అనుభవం ఉందని అన్నారు. ఇప్పటికే రెండు ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకలు ఉండగా మూడో INS Vikrant తయారు చెయ్యడంలో ముఖ్య ఉద్దేశం గత కొంత కాలంగా హిందూ మహాసముద్రంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను ద్రుష్టిలో పెట్టుకుని దీనిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ మరింత పటిష్టంగా ఉండాలంటే భారత్ కు మూడవ యుద్ద విమాన వాహక నౌక తప్పనిసరి అని నేవీ భావిస్తోంది. అంతేకాక రెండు యుద్దనౌకలతో సముద్ర జలాల్లో కంటిన్యూగా సేవలు అందాలంటే వాటికి మద్యలో మెయింటినెన్స్ నిమిత్తం కొన్ని సార్లు వెనక్కి తీసుకు రావాల్సి ఉటుంది అలాంటప్పుడు ఒక్క యుద్ద నౌకతో గస్తీ చాలా కష్టతరం అవుతుంది దీనిని దృష్టిలో పెట్టుకుని మూడో విమాన వాహక నౌకను రూపొందిస్తుంది భారత నేవీ.

Read Also…Rafale Deal: INS Vikranth యుద్ద విమానం కోసం మరిన్ని రాఫెల్స్ కొనుగోలు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular