శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023
Homeఅంతర్జాతీయంRafale Deal: INS Vikranth యుద్ద విమానం కోసం మరిన్ని రాఫెల్స్ కొనుగోలు

Rafale Deal: INS Vikranth యుద్ద విమానం కోసం మరిన్ని రాఫెల్స్ కొనుగోలు

భారత నావికాదళం త్వరలో మరింత శత్రు దుర్బెద్యంగా మారభోతోంది. సెప్టెంబర్ 02 -2022 న కేరళ లోని కొచ్చి లో మోదీ చేతులమీదుగా జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ద నౌక కు గత కొంత కాలంగా దీనిపై ట్రయల్ రన్ చేస్తోంది. అయితే ఇది విమాన వాహక నౌక కావడంతో దీనిపై ఎలాంటి యుద్ద విమానాలు నిలపాలనే అయోమయంలో ఉండగా భారత్ కు చెందిన MIG-29K యుద్ద విమానాన్ని రాత్రి సమయంలో ల్యాండ్ చేసి సక్సెస్స్ అయ్యారు.

అయితే ప్రస్తుతం ఇండియన్ నేవీ MIG-29K ను పక్కనపెట్టి తరువాత ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన 4.5వ తరం రాఫెల్ యుద్ద విమానాన్ని కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ద నౌకపై ల్యాండింగ్ చేసి ట్రయల్స్ పూర్తి చేసారు. అయితే తాజాగా రాఫెల్ యుద్ద విమానాలను ఐఎన్ఎస్ విక్రాంత్ పై నిలపాలని భారత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే డిఫెన్స్ అక్వేజిషణ్ కౌన్సిల్ రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు కై రేపు సమావేశం అవ్వనున్నారు. వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ఉండడంతో రేపు జరగబోవు సమావేశంతో ఈ డీల్ పై ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.      

RELATED ARTICLES
- Advertisment -

Most Popular