ఆదివారం, మే 26, 2024
Homeభక్తిTholi Ekadashi: తొలి ఏకాదశి విశిష్టత మరియు పాటించాల్సిన నీయమాలు

Tholi Ekadashi: తొలి ఏకాదశి విశిష్టత మరియు పాటించాల్సిన నీయమాలు

Tholi Ekadashi: ఆశాడ శుద్ధ ఏకాదశి ని శయన ఏకాదశి అంటారు లేదా తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి ఎంతో విశేషమైనది ఎందుకంటే పాల సముద్రంలో ఉన్న ఆదిశేషుని వడిలో విష్ణుమూర్తి నిద్రలోకి వెళతారు. దీనినే శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు.

అయితే తొలి Tholi Ekadashi విష్ణు మూర్తి నిద్రలోకి వెళ్ళడం

అయితే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి తిరిగి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున నిద్ర నుండి బయటకు వస్తారు. ఈ రెండు ఏకాదశి లు మధ్య ఉన్న మొత్తం సమయం నాలుగు నెలలు దీనినే చాతుర్మాసం గా పిలుస్తారు.

Tholi Ekadashi నుండే పండుగలు మొదలు

అంతేకాక ఈ మాసం నుండి పండగలు మొదలవుతాయి ఆదిగా వస్తుంది కావున తొలి ఏకాదశి గా పిలుస్తారు. అంతే కాక ఇప్పడిధాకా జరిగిన ఉత్తరాయణం పూర్తి అయ్యి ఇక నుండి దక్షిణాయనం మొదలవుతుంది అంటే ఆషాఢ మాసం అన్నమాట.

Tholi Ekadashi పాటించవలసిన నీయమాలు

ఈ మాసంలో వర్షాలు పడతాయి కావున అంటు రోగాలు ఎక్కువగా ప్రబలుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే పూర్వకాలంలో ఋషులు చాతుర్మాస్య దీక్షను పాటించడంలో అంతరంగ ఇదే. ఈ మాసంలో ఎక్కవగా ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే కాలం మారడం చేత పలు రోగాలు ప్రబలుతాయి దీనితో ప్రాణనష్టం జరుగుతుంది దీనిని దృష్టిలో పెట్టుకొని ఋషులు ఈ మాసం నుండి వ్రతాలు, పూజలు, ఉపవాసాలు చెయ్యాలని సూచించేవారు.

తొలి ఏకాదశి కథ

అసలు శయన ఏకాదశి ఎందుకు వచ్చిందంటే పూర్వం మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడిని సంహరించడం కోసం విష్ణు మూర్తి అతనితో  చాలా సంవత్సరాల పాటు యుద్ధం చేసి అలసిపోయి ఒక గృహాలో విశ్రాంతి తీసుకుంటాడు.

అప్పుడు విష్ణు మూర్తి శరీరం నుండి ఏకాదశి అనే ఒక శక్తి ఉద్భవించి ఆ శక్తి మురాసురునితో యుద్ధం చేసి ఆ రాక్షసుడిని వదిస్తుంది ఇది చూసిన విష్ణుమూర్తి సంతోషించి నీకు ఏమి వరం కావాలో కోరుకోమనగా విష్ణు లోకంలో శాశ్వత నివాసం ఇవ్వమని కోరగా విష్ణువు సరేనని ఆమెను తనలోనే ఐక్యం చేసుకుని విష్ణు లోకంలో స్థిర నివాసం ఇస్తాడు.

తొలి ఏకాదశి రోజు పాటించవలసిన వలన ఆరోగ్యానికి మేలు

అందుకే Tholi Ekadashi నాడు విష్ణు మూర్తికి పూజించి లేదా వ్రతం చేసి ఎవరైతే ఆ రోజు ఉపవాసం ఉంటారో వారందరికీ విష్ణు లోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఈమాసంలో చేసే పూజలు, దాన ధర్మాలు విశేష ఫలితాలను అందిస్తాయి.

ఏకాదశి రోజు విష్ణు మూర్తికి చెయ్యాల్సిన పూజలు 

అంతేకాక ఈ రోజు ఉపవాసం అంటే ఆధ్యాత్మికంగా మరియు సైంటిఫిక్ గా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని నమ్ముతారు. ఉపవాసం ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది అంతేకాక శరీరానికి కొత్త ఉత్తేజం చేకూరుతుంది. శరీరంలో అల్సర్, అధిక బరువు వంటి వ్యాధులు దరిచేయవని మరియు కేన్సర్ ను కూడా అరికట్టవచ్చని చెబుతారు.

ఆరోగ్యం పరంగానే కాక Tholi Ekadashi నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే జన్మ జన్మల పాపాలు, కర్మలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. పెళ్ళై ఇంట్లో ఇబ్బందులు ఉన్నవారికి ఇబ్బందులు తీరిపోతాయి. అంతేకాక ఆర్థికంగా ఉన్నతిని సాధిస్తారు అంతేకాక మోక్షాన్ని కోడా పొందుతారు.

Tholi Ekadashi  లో చెయ్యకూడని పనులు

తొలి ఏకాదశి మొదలైన నాటి నుండి శుభకార్యాలు చెయ్యడం నిషిద్దం కావున గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు మొదలగు శుభకార్యాలు చెయ్యకూడదు.

ఈ మాశంలో మద్యం, మాంసం, పలు కూరగాయలు, పెరుగు, నూనె పంచదార వంటి మరికొన్ని పదార్ధాలు మరియు కూరగాయలు తినడం నిషిద్దం.

ఈమాసంలో చేసే పూజలు, దాన ధర్మాలు విశేష ఫలితాలను అందిస్తాయి.

 

Read Also…కేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath yatra

Read Also…Dakshinamurthy Stotram | అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి స్తోత్రం

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular