గురువారం, ఫిబ్రవరి 22, 2024
Homeక్రీడలుICC World Cup 2023: IND vs PAK వరల్డ్ కప్ మ్యాచ్ పై సందిగ్ధత

ICC World Cup 2023: IND vs PAK వరల్డ్ కప్ మ్యాచ్ పై సందిగ్ధత

ICC World Cup 2023: 2023 భారత్ లో జరగబోయే వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కు క్రికెట్ స్టేడియాలు సమాయత్తం అవుతున్నాయి. పిచ్ తయారీ తో పాటు విదేశీ ఆటగాళ్లకు కావలసిన వసతులు ప్రక్రియ కూడా జరుగుతున్న నేపద్యంలో క్రికెట్ లవర్స్ కు ఒక చేదు వార్త వినిపిస్తోంది. భారత్ లో జరిగే వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కు పాకిస్థాను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తోంది.

ప్రస్తుతం ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు పాకిస్థాన్ విదేశాంగ శాఖా మంత్రి బిలావల్ బుట్టో మరియు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ స్పోట్స్ మినిస్టర్ రియాజ్ కలిసి ప్రధాని షరీఫ్ తో ఒక ఉన్నతస్థాయి మీటింగ్ నేడు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ పాకిస్థాన్ లో రాజకీయంగా కొట్టుకుని దుమ్మేత్తిపోసుకునే పార్టీలు అన్నీ కలిసి ఇప్పుడు ఈ మీటింగ్ కోసం కలుసుకోవడం విచిత్రం. అయితే ఈ కమిటీలో న్యాయ శాఖా అధికారి, పాకిస్థాన్ ఇంటలిజెన్స్ అధికారులు కోడా ఈ కమిటీలో ఉన్నారు. అయితే పాకిస్థాన్ లో అక్టోబర్ లో ఎన్నికలు ఉండడంతో ఇలాంటి సమయంలో భారత్ కు పాకిస్థాన్ టీమ్ వెళ్లి అక్కడ ఓటమిపాలయితే  ఆ ప్రభావం ఇప్పుడున్న పాకిస్థాన్ గవర్నమెంట్ పై పడుతుందని భావిస్తోంది.

అంతేకాదు రిజల్ట్ కొంచెం తేడా వచ్చినా దీనిని విపక్షాలు అదునుగా చేసుకుంటాయని ఆలోచిస్తోంది. అక్టోబర్ 15న నరెంద్రమోదీ స్టేడియం అహ్మదాబాద్ లో భారత్ మరియు పాకిస్థాన్  తలపడనున్నాయి. అయితే ఈ కమిటీలో పాల్గొన్న మెంబెర్స్ సూచనల ఆధారంగా భారత్ తో ఆడాలా వద్దా అనేది త్వరలో తెలిసిపోతుంది. ఒకవేళ పాకిస్థాన్ బారత్ తో మ్యాచ్ ఆడదలచుకుంటే అప్పుడు పాకిస్థాన్ విదేశాంగ శాఖా మంత్రి భారత్ కు తెలియజేస్తారు.

Read Also….Saurav Ganguly Birthday: హ్యాపీ బర్త్డే దాదా

Read Also….Sarfaraz Khan: BCCI తనను సెలెక్ట్ చేయకపోవడం పై సెలక్టర్ పై వేలు ఎత్తిన సర్ఫరాజ్ 

Read Also….ICC ODI World Cup 2023 Schedule | వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular