ఆదివారం, జూలై 14, 2024
Homeక్రీడలుSarfaraz Khan: BCCI తనను సెలెక్ట్ చేయకపోవడం పై సెలక్టర్ పై వేలు ఎత్తిన సర్ఫరాజ్

Sarfaraz Khan: BCCI తనను సెలెక్ట్ చేయకపోవడం పై సెలక్టర్ పై వేలు ఎత్తిన సర్ఫరాజ్

యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మరియు BCCI లోని కొంతమంది సెలక్టర్ల మద్య వివాదం తారాస్థాయికి చేరింది. త్వరలో జరగబోవు భారత్ మరియు వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ ఎంపిక పూర్తయ్యింది అయితే ఈ సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చెయ్యక పోవడంపై సెలక్టర్లపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే భారత్ మరియు వెస్టిండీస్ సిరీస్ కు సెలక్షన్ కమిటీలో శివ సుందర్ దాస్ ముఖ్య పాత్ర పోసించగా ఇప్పుడు ఈ విషయం పెద్ద వివాదంగా మారింది.

మొన్న డిల్లీ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన సందర్భంలో పరుగెత్తుకుంటూ వచ్చి గంభీరంగా డ్రెసింగ్ రూమ్ వైపు వేలు ఎత్తి కోపంగా అరవడంతో అదికాస్తా వివాదంగా మారింది  ఈ విషయాన్ని ఇప్పుడు కారణంగా చూపుతూ BCCI కి చెందిన ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి సర్ఫరాజ్ ఖాన్ ను సెలక్ట్ చెయ్యకపోవడానికి గల కారణాలు చెబుతూ సర్ఫరాజ్ మొన్న డిల్లీ మ్యాచ్ లో చెయ్యి చూపించింది తనకు ఎదురుగా ఉన్న సెలక్టర్ పై అని ఇలాంటి క్రమశిక్షణ లేకుండా చేసిన పనులవల్లె సెలక్షన్ కమిటీ అతన్ని పరిగణలోకి తీసుకోలేదని తెలిపింది.

 అంతేకాక సర్ఫరాజ్ ఖాన్ ను టీమ్ లోకి తీసుకోవాలంటే అతను ఫిట్నెస్ పై ద్రుష్టి పెట్టాలని బరువు తగ్గించుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన ఫిట్నెస్ సంపాదించాలని సెలక్టర్లు అన్నారు. అయితే సర్ఫరాజ్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం సెలక్టర్ల వైపు అతడు వేలు చూపించలేదని అతను తన డ్రెస్సింగ్ రూమ్ వైపు వేలు చూపించాడని. సెంచరీ చేసినప్పుడు మిగతా ప్లేయర్లకు ఒత్తిడి కలగకూడదనే ఇలా చేసాడంటున్నారు. అంతేకాక ఇండియన్ టీమ్ లో ఫిట్నెస్ లేకుండా ఎంత మంది అదిక భరువు ఉన్నారో చెప్పమంటారా అంటూ BCCI  కి చురకలు అంటిస్తున్నారు.

Read Also…ICC ODI World Cup 2023 Schedule | వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular