ఆదివారం, జూలై 14, 2024
Homeక్రీడలుSaurav Ganguly Birthday: హ్యాపీ బర్త్డే దాదా

Saurav Ganguly Birthday: హ్యాపీ బర్త్డే దాదా

భారతీయ మాజీ క్రికెటర్ మరియు కెప్టెన్ తో పాటు క్రికెట్ లవర్స్ దాదా అని ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ పుట్టినరోజు నేడు. క్రికెట్ లోనే కాకుండా తన వయస్సులోనూ హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. 50వ సంవత్సరం పూర్తయ్యి 51వ సంవత్సరలోని అడుగుపెట్టాడు గంగూలీ. 

సౌరవ్ గంగూలీ 1992లో వన్డే కేరేర్ స్టార్ట్ చెయ్యగా 1996 లో తన టెస్ట్ కెరీర్ స్టార్ట్ చేసి ఆడిన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో రెండు సెంచరీలు కొట్టడంతో ఒక్కసారిగా అందరి చూపు గంగూలీపై పడింది. ఇక క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే ఇండియన్ క్రికెట్ చరిత్రనే పూర్తిగా రూపు రేఖలు మార్చేసి తనదైన మార్క్ తో కెప్టెన్ గా కీలక స్థానాన్ని అధిరోహించాడు.

ప్రపంచ క్రికెట్ లో భారత్ వరుస ఓటములు చవిచూస్తూ విదేశీ గడ్డపై ఓటములతో సతమతం అవుతున్న సమయంలో  కెప్టెన్ బాద్యతలు అందుకున్న సౌరవ్ గంగూలీ కొత్త కొత్త ఆటగాళ్ళు అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో పలు ఎక్స్పర్మెంట్స్ చేస్తూ మొత్తం మీద విదేశీ గెడ్డపై భారత్ రాణించడంలో సౌరవ్ గంగూలీ పాత్ర ఎంతగానో ఉంది.

అయితే సౌరవ్ గంగూలీ 2008 ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ తరువాత ఇండియన్ టీమ్ నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం BCCI లో ఒక డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే గంగూలీ 08-జూలై-1972 లో కలకత్తా లో జన్మించాడు.

Read Also….Sarfaraz Khan: BCCI తనను సెలెక్ట్ చేయకపోవడం పై సెలక్టర్ పై వేలు ఎత్తిన సర్ఫరాజ్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular