ఆదివారం, జూలై 21, 2024
Homeసినిమాప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఖాతాలపై కాపీరైట్ స్ట్రైక్స్ వేసిన వైజయంతి మూవీస్

ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఖాతాలపై కాపీరైట్ స్ట్రైక్స్ వేసిన వైజయంతి మూవీస్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ లో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న చిత్రం కల్కి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యగా ఈ గ్లింప్స్ కు సినీ క్రిటిక్స్ నుండి అద్భుత స్పందన లబించింది. కల్కి సినిమా గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చిందనే ఆనందలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు కల్కి మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది.

తాజాగా రీలేజ్ అయిన కల్కి సినిమాలోని ప్రభాస్ పోస్టర్స్, గ్లింప్స్ ను Prabhas Fans Twitter ఖాతా నుండి కాపీ చేసి వారి యొక్క ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చెయ్యడం వీడియోలను షేర్ చెయ్యడంతో ప్రస్తుతం వారి ట్విట్టర్ ఖాతాలకు కాపీరైట్ స్ట్రైక్స్ వేసింది వైజయంతి మూవీస్ బేనర్ దీనితో చాలా మందికి అనేక స్ట్రైక్స్ పడడంతో కొందరి ఎకౌంట్లు సస్పెండ్ కూడా అయిపోయాయి.

మరికొందరికైతే ప్రభాస్ లుక్ పోస్టర్ కాపీ చేసినందుకు ఒకటి, ఫస్ట్ గ్లిప్స్ తమ ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసినందుకు మరొకటి మొత్తం రెండేసి స్ట్రైక్ లు పడ్డాయి. ఇక ఈ సినిమాపై రివ్యూలు ఇచ్చిన పాపులర్ క్రిటిక్స్ అకౌంట్ లపై కూడా వైజయంతి మూవీస్ స్ట్రైక్ లు వెయ్యడం గమనార్హం.

ప్రస్తుతం ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ వైజాంతి మూవీస్ బ్యానర్ పై మండిపడుతున్నారు ఫ్యాన్స్ ఎకౌంట్స్ పై కాపీరైట్ స్ట్రైక్స్ వెయ్యడం ఏమిటంటూ ఫ్యాన్స్ సినిమా ను పబ్లిసిటీ చెయ్యడంలో ఇది కూడా ఒక భాగమే కదా అంటూ ఈ సినిమా రీచ్ ను మీకు మీరే చిన్న చిన్న కారణాలతో చెడగోట్టుకుంటున్నారని మండిపడుతున్నారు.

మీ అరికాలుని మీరే కాల్చుకుంటున్నారని వైజయంతి మూవీస్, నాగ్ అశ్విన్, స్వప్న దత్ ను ట్యాగ్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అంతేకాక ఈ సినిమా గ్లింప్స్ పై మంచిగా రివ్యూ ఇచ్చిన క్రిటిక్స్ ట్విట్టర్ ఖాతాలపై పడిన కాపీ రైట్ స్ట్రైక్స్ కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

అంతేకాక హాలివుడ్ సినిమా ట్రైలర్స్ రిపోస్ట్ చేసినా స్ట్రైక్ పడలేదని 600 కోట్లతో తెరకెక్కుతున్న సినిమాకు పబ్లిసిటీ చాలా అవసరం ఇలాంటి పనులు చేస్తే చాలా కష్టం అంటూ నిర్మాణ సంస్థపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ లు షేర్, పోస్ట్ చెయ్యడం మానేసారు ప్రభాస్ ఫ్యాన్స్.

Read Also….Project K Glimpse: ఇండియన్ ప్రైడ్ సినిమాగా ప్రాజెక్ట్ కె

Read Also….Project k: చిరుత లాంటి చూపులతో సూపర్ హీరోలా ప్రభాస్ ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular