గురువారం, ఫిబ్రవరి 29, 2024
HomeసినిమాProject K Glimpse: ఇండియన్ ప్రైడ్ సినిమాగా ప్రాజెక్ట్ కె

Project K Glimpse: ఇండియన్ ప్రైడ్ సినిమాగా ప్రాజెక్ట్ కె

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కె గత కొన్ని రోజులుగా ఈ మూవీ కి సంబంధించి చిన్న అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ ఆతున్నాయి. అంతేకాక వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అనే ఎగ్జైట్మెంట్ ని ఆడియన్స్ లోకి బలంగా తీసుకువెళ్ళాడు నాగ్ అశ్విన్. దీనికి నిదర్శనమే అమెరికాలోని కామిక్ కాన్ లో జరిగిన ఈ భారీ వేడుక ఇంత సక్సెస్ అవ్వడానికి ఒక విదంగా కారణమైంది.

ఇప్పటి వరకూ దీపికా పదుకొనే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ నిన్న ప్రభాస్ లుక్ పోస్టర్ ని వదిలడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై హైప్ పెరిగిపోయింది. అయితే నేడు ప్రాజెక్ట్ కె టైటిల్ మరియు గ్లిమ్ప్స్
రిలీజ్ చేసారు మేకర్స్. ఈ గ్లిమ్ప్స్ లో టైటిల్ ”కల్కి 2898 AD” గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అంతే కాక ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. ఈ గ్లిమ్ప్స్ లో మనిషి చేతిలో శివుని బొమ్మ, దీపికా పదుకొనె సీన్, శివలింగం దగ్గరకు రోబోర్ట్ వెళ్ళడం, అమితాబ్ సీన్ తో పాత ప్రభాస్ లుక్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అంతే కాక చివరిలో వచ్చే వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అనే డైలాగ్ తో గ్లిమ్ప్స్ ముగుస్తుంది.

ఈ రోజు రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ లో ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ప్రభాస్ తన లుక్ మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి చిన్న మొబైల్ లోనే ఇంత గ్రాండియర్ గా ఉంటె అదే దియేటర్ లో అయితే
ఆ ఎక్ష్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ఇక ప్రభాస్ లుక్ మరియు ఎక్ష్ప్రేసన్స్ టాప్ లెవెల్ లో ఉన్నాయి.

ఈ గ్లిమ్ప్స్ లో ప్రతీ సీన్ హాలివుడ్ రేంజ్ లో కనిపిస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న
ఈ మూవీ ప్రభాస్ చేతిలో వాచ్ ను గమనిస్తే టైమ్ ట్రావెల్ కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాక స్టోరీ కూడా కలియుగం చివరిలో రోబోట్స్ భూమిపై దాడి చేసి ఆలయాలను ద్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గ్లిమ్ప్స్ లో ఎక్కడా కమల్ హాసన్ కనిపించలేదు మొత్తం మీద నాగ్ అశ్విన్ ప్రపంచం మెచ్చుకునే ఇండియన్ ప్రైడ్ సినిమా తీస్తున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Read Also….Project k: చిరుత లాంటి చూపులతో సూపర్ హీరోలా ప్రభాస్ ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్

Read Also….రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో లీకైన OMG 2 సినిమా

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular