బుధవారం, జూలై 17, 2024
HomeసినిమాProject k: చిరుత లాంటి చూపులతో సూపర్ హీరోలా ప్రభాస్ ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్

Project k: చిరుత లాంటి చూపులతో సూపర్ హీరోలా ప్రభాస్ ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత భారీ మరియు ప్రతిష్టాత్మకమైన చిత్రం ప్రాజెక్ట్ కె ను జూలై 2021 న షూటింగ్ స్టార్ చేసిన టీమ్ కరెక్టుగా నేటికి రెండు సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఈ రెండు సంవత్సరాల నుండీ ఒక్క పోస్టర్ గాని, అప్డేట్స్ గాని, సినిమా నుండి చిన్న లీక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు నాగ్ అశ్విన్. అయితే ఫ్యాన్స్ మాత్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూపులకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరదించేసి గత కొద్ది రోజులుగా వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపాడు నాగ్. రెండు రోజుల క్రితం హీరోయిన్ దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

నేడు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్ అయితే ప్రభాస్ లుక్ మాత్రం సూపర్ హీరోలా ఉండడంతో ఇప్పుడు ఈ లుక్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరెల్ గా మారింది. ప్రభాస్ లుక్ లో ఎక్ష్ప్రేషన్స్ అద్భుతం గా ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి షాన్ డియాగో లోని కామిక్ కాన్ వేడుకల నిమిత్తం ఇప్పటికే చిత్ర బృందం తో పాటు నటుడు రానా, ప్రభాస్ యు.ఎస్ చేరుకున్నారు.

ఈ ఈవెంట్ కు ఒక భారతీయ చిత్రం అదీ తెలుగు చిత్రం అక్కడ ప్రదర్శించే అవకాశం కలగడం ఎంతో అద్భుతమంటూ సినీ పెద్దలు కొనియాడుతున్నారు. రేపు యూ.ఎస్ లో ప్రాజెక్ట్ కె అంటే ఏమిటి అనే గ్లిమ్ప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుండగా ఇండియాలో 21 న ప్రాజెక్ట్ కె గ్లిప్స్ మరియు ప్రాజెక్ట్ కె అసలు టైటిల్ ను రెవీల్ చెయ్యనున్నారు.

Read Also..Big Boss: బిగ్ బాస్ షో లో సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్టు

Read Also..రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో లీకైన OMG 2 సినిమా

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular