బుధవారం, నవంబర్ 29, 2023
Homeసినిమారిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో లీకైన OMG 2 సినిమా

రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో లీకైన OMG 2 సినిమా

బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత కొంత కాలంగా బాలివుడ్ స్టార్ హీరోగా చక్రం తిప్పి మినిమం గారెంటీ హీరోగా పేరుతెచ్చుకుని తర్వాత బాలివుడ్ లో భారీ కలెక్షన్ లు సాదించి తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో అక్షయ్ కమార్. అయితే ఇది ఒకప్పటి మాట కొన్నాళ్ళుగా వరుస సినిమాలు ఫ్లాప్ లు అవ్వడంతో ఇప్పుడు అక్షయ్ OMG 2 పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

OMG కి సీక్వెల్ గా వస్తున్న సినిమా OMG 2 ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుని పాత్రలో కనిపించనుండగా మీర్జాపూర్ ఫ్రేమ్ పంకజ్ త్రిపాఠీ ఈ సినిమాలో శివ భక్తునిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 11 న రిలీజ్ కానుండగా ఈ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించగా సెన్సార్ బోర్డు ఈ సినిమాపై అబ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది అంతేకాక ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారని తెలుస్తోంది.

సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవకపోవడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో శివ భక్తునిగా నటించిన పంకజ్ త్రిపాఠీ కి చెందిన ఈ సినిమాలోని ఒక వేదియో సోషల్ మీడియాలో లీకైనట్లు తెలుస్తుంది. ఈ విడియోలో కాలేజ్ లో ఒక స్వలింగ సంపర్కుడి పై వివక్ష చూపి చిత్ర హింసలకు గురి చెయ్యడంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకుంటాడు కథ మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది.

అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్న పంకజ్ త్రిపాఠీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి సెక్స్ పై అవగాహన కలిగిస్తుంటాడు. అంతేకాక ఎడుకేషన్ లో కూడా దీనిని ఒక భాగం చెయ్యాలని చూస్తాడు లీకైన వీడియోలో ఇదే కధగా తెలుస్తోంది. దీనితోనే సెన్సార్ బోర్డ్ ఈ చిత్రాన్ని వేరొక కమిటీకి పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదిపురుష్ సెన్సార్ విషయంలో కోర్టు సెన్సార్ సభ్యులపై అబ్యంతరం తెలపడంతో ఈ సినిమాపై సెన్సార్ సభ్యలు ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు.

Read Also….దియేటర్ లో రిలీజ్ కాకుండానే movie rulz లో ప్రత్యక్షమైన శక్తి సినిమా 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular