ఆదివారం, మే 26, 2024
Homeక్రీడలుకిటికీలోంచి తొంగి చూడడంపై రోహిత్ శర్మ ను ఆడుకుంటున్న నెటిజన్లు..!

కిటికీలోంచి తొంగి చూడడంపై రోహిత్ శర్మ ను ఆడుకుంటున్న నెటిజన్లు..!

ఇండియా మరియు వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లకు గాను భారత్ 1-0 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్ కూడా భారత్ గెలవాల్సి ఉండగా చివరి ఇన్నింగ్స్ చివరి రోజు భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను డ్రాగా నిర్ణయించారు.

అయితే ఇదే మ్యాచ్ చివరి భారత్ చివరి ఇన్నింగ్ లో బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ వద్ద కిటికీ నుండి పదే పదే కిటికీ లోంచి తల బయటకు పెట్టి చూస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ లవర్స్ మేమ్స్, ఫన్నీ కామెంట్లతో రోహిత్ శర్మను ఒక ఆట ఆడుకున్నారు.

బయటకి చూస్తూ ఉన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ”బ్రో ఇపుడే లేచావా ఏంటి” అని కొందరు ఇంకొందరైతే ఉదయం 10 గంటలు లేచినవాడి పేస్ లాగా ఉంది అంటూ మరికొందరైతే 10గంటలకు నిద్ర లేచి డైరెక్ట్ స్కూల్ కి వెళ్ళే వాడి పేస్ అంటూ మరికొందరైతే రోహిత్ శర్మ తన జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోయాడు అనూ రోహిత్ పై ఫన్నీ కామెంట్స్, మేమ్స్ తో సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చెయ్యగా ఇప్పుడు వైరెల్ అయ్యాయి.

భారత్ రెండవ టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేద్దామని భావించగా వర్షం వచ్చి డ్రాగా ప్రకటించడంతో రోహిత్ శర్మ అసహనానికి గురైయ్యాడు. గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ కూడా వర్షం వల్ల ఆగిపోవడం దురదృష్టమని రోహిత్ అన్నాడు. అంతేకాక మ్యాచ్ ముగిసిన అనంతరం మ్యాచ్ ప్రజంటేషన్స్ సందర్భంలో మైక్ కూడా విసిరేశాడు.

అంతేకాక మాకు ప్రతీ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అది ఇండియా లో జరిగినా లేదా వెస్ట్ ఇండీస్ లో జరిగినా ఒక్కో చోట ఒక్కో రకమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నాడు. పూర్తి స్థాయి పాస్ట్ బౌలర్స్ లేకపోయినా సిరాజ్ మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచాడని, కోహ్లీ కూడా బ్యాటింగ్ అద్భుతంగా చేసాడని జూనియర్స్ అతన్ని చూసి నేర్చుకోవాలని సూచించాడు

Read Also….ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఖాతాలపై కాపీరైట్ స్ట్రైక్స్ వేసిన వైజయంతి మూవీస్

Read Also….ICC World Cup 2023: IND vs PAK వరల్డ్ కప్ మ్యాచ్ పై సందిగ్ధత

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular