శుక్రవారం, జూలై 26, 2024
Homeఅంతర్జాతీయంకాశ్మీర్ అంశంలో భారత్ పై 300 సార్లు యుద్ధం చేస్తాం..పాకిస్థాన్

కాశ్మీర్ అంశంలో భారత్ పై 300 సార్లు యుద్ధం చేస్తాం..పాకిస్థాన్

భారత్ పై పాకిస్థాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అదికూడా ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ అంశంపై తన అక్కసును వెళ్ళగక్కింది. పూర్తి వివరాలలోకి వెళితే ఆర్టికల్ 370 పై సుప్రీంలో వేసిన
పిల్ పై తాజాగా సుప్రీంకోర్టు ఇక ఆర్టికల్ 370 తిరిగి తీసుకురావడం ఇక కుదరదని తేల్చి చెప్పింది.

సుప్రీం కోర్టు తీర్పుపై పాక్-చైనా వివాదాస్పద వ్యాఖ్యలు

అంతేకాక ఈ ఆర్టికల్ 370 రద్దు రాష్ట్రపతి అనుమతి సరైన పద్దతిలోనే జరిగిందని డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కాన్సిస్ట్యూషన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో పాకిస్థాన్ మరియు దాని మిత్ర దేశమైన చైనా భారత్ పై విషం వెళ్ళగక్కాయి. తాజాగా పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న “అన్వర్ ఉల్ హక్ కక్కర్” మరియు చైనా అధ్యక్షుడు “జిన్ పింగ్” భారత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదాస్పద రీతిలో స్పందించారు.

కాశ్మీర్ అంశంలో భారత్ పై 300 సార్లు యుద్ధం చేస్తాం

పాకిస్థాన్ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాశ్మీర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కాశ్మీర్ విషయం ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఉన్నాదని ఐక్యరాజ్య సమితికి వ్యతిరేకంగా భారత్ ఎలా నిర్ణయం తీసుకుంటాదని కాశ్మీర్ కోసం 300 సార్లు యుద్ధం చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కాశ్మీర్ విషయంలో చైనా స్పందిస్తూ ఇదొక అసంబద్ద చర్యాగా కొనియాడింది.

సుప్రీం తీర్పుపై చైనా వ్యాఖ్యలు

అంతేకాక కాశ్మీర్ మరియు లద్ధాక్ రెండూ కూడా భారత భూబాగానికి చెందిన ప్రాంతాలు కావంటూ మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది చైనా. అంతేకాక భారత్ ఇల్లీగల్ గా నిర్మించిన లద్ధాక్ ప్రాంతం అంటూ కొనియాడింది. భారత్ పై పాకిస్థాన్ మరియు చైనా వ్యాఖ్యలపై భారత దౌత్య వేత్త తో పాటు పలువులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

భారత్ పై ఇప్పటికీ నాలుగు సార్లు యుద్ధం ఓడిపోయిన పాక్

ఇప్పటికే 1947, 1965, 1971, 1999 లలో మొత్తం నాలుగు సార్లు చిత్తుగా ఓడిన పాకిస్థాన్ మరో 300 సార్లు వోడిపోవడానికి రెడీగా ఉందంటూ పాకిస్థాన్ పై కామెంట్స్ చేస్తున్నారు అంతేకాక మాపై యుద్ధం తరువాత చేద్దురుగాని మీదేశంలో ఆహార దాన్యాలు లేక ప్రజలు మీపై తిరగాబడుతున్నారని వాళ్ళే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేలే ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Read Also..ఫిలిపీన్స్ నౌకపై చైనా నౌక జల పిరంగులతో దాడి

Read Also..మా అప్పు తీర్చకపోతే ఇక జరిగేది అదే..పాకిస్థాన్ కి చైనా గట్టి వార్నింగ్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular