మంగళవారం, జూన్ 18, 2024
Homeఅంతర్జాతీయంమా అప్పు తీర్చకపోతే ఇక జరిగేది అదే..పాకిస్థాన్ కి చైనా గట్టి వార్నింగ్

మా అప్పు తీర్చకపోతే ఇక జరిగేది అదే..పాకిస్థాన్ కి చైనా గట్టి వార్నింగ్

పాకిస్థాన్ కు మిత్ర దేశం అయిన చైనా తాజాగా పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా మిత్ర దేశాలుగా ఉన్న ఈ రెండు దేశాల మద్య వ్యతిరేక ధోరణి కనిపిస్తుంది. ఇప్పటికే అప్పుల ఊభిలో సతమతమవుతున్న పాకిస్థాన్ కు భారీగా అప్పులు ఇచ్చి వాటిని రాబట్టడానికి చైనా నానా తిప్పలు పడుతుంది. ఇప్పటికే డిఫెన్స్ ఎక్యూప్మెంట్స్ ను పాకిస్థాన్ చైనా నుండి కొనుగోలు చేస్తూ వస్తూంది.

అయితే ఈ కొనుగోళ్లలో యుద్ద విమానాలలో JF-17 వంటివి చైనా నుంచి కొనుగోలు చెయ్యగా వీటితో పాటు పలు మిస్సైల్స్, సుబ్మేరైన్స్, ప్రిగేటర్స్, అన్మేనెడ్ వెహికల్స్ వంటివి పాకిస్థాన్ చైనా నుండి కొనుగోలు చేసింది. అయితే తాజాగా పాకిస్థాన్ చైనా నుండి కొనుగోలు చేసిన VT4 ట్యాంక్స్, ఆర్టిలరీ గన్స్, మిస్సైల్ సిస్టమ్స్ వంటి డిఫెన్స్ ఆయుధాలను కొనుగోలు చేసింది.

అయితే ఈ ఆయుధాలను చైనా నుండి అప్పు చేసి మరీ ఆయుధాలను సమకూర్చుకుంది పాకిస్థాన్. అయితే ఈ అప్పు తీర్చకపోవడంతో చైనా – పాకిస్థాన్ మద్య గతంలో పలుమార్లు మీటింగ్ లో చెప్పినా పాకిస్థాన్ కట్టలేదు. అయితే నేడు జరిగిన చైనా – పాకిస్థాన్ మద్య హై లెవెల్ మీటింగ్ లో పాకిస్థాన్ ను వెంటనే తీసుకున్న అప్పు తీర్చాలని ప్రెజర్ పెట్టినట్లు తెలుస్తోంది.

అంతేకాక ఒకవేళ ఈ అప్పు చెల్లించకుంటే డిఫెన్స్ మెయిన్టినెన్స్ ఆపేస్తామని, ఇకపై డీల్స్ అపెస్తామంటూ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అప్పుల బారంతో తినడానికి తిండి కూడా దొరకకపోవడంతో పాకిస్థాన్ లో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు అయ్యింది పాకిస్థాన్ పరిస్థితి. ఒక వైపు చైనా ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రం గా ఉండడంతోనే పాకిస్థాన్ ని పై ఒత్తిడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular