శుక్రవారం, జూలై 26, 2024
Homeభక్తిNishkalank Mahadev Temple ఇది చదివితే మీ పాపాలన్నీ హరించిపోతాయ్

Nishkalank Mahadev Temple ఇది చదివితే మీ పాపాలన్నీ హరించిపోతాయ్

Nishkalank Mahadev Temple History in Telugu: గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ కి సమీపంలో ఉన్న కొలియక్ అనే గ్రామం లో అరేబియన్ సముద్రం నందు ఓ  ఆలయం ఉంది  తూర్పున సముద్ర తీరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో నిష్కలంక్ మహదేవ్ ఆలయం ఉంది. భారతీయ క్యాలెండర్ ప్రకారం బాదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహదేవ్ ను ప్రతిష్టించారని చెబుతారు.నిష్కలంక్ మహాదేవ ఆలయం  నిష్కలం అంటే పాపాలు దూరం చేసేది అని అర్థం మహదేవ్ అంటే  శివుడు అని అర్థం.

Nishkalank Mahadev Temple History

ఈ ఆలయ ప్రత్యేకత విషయానికొస్తే ఉదయంపూట పెద్ద అలలు వచ్చే సమయంలో  ఆలయం గోపురం పై భాగం మాత్రమే కనిపిస్తుంది.. మధ్యాహ్నం 11 తర్వత  ఆ అలలు మెల్లగా వెనక్కి వెళ్లిపోయి ఆలయం ఎంతో దివ్యమైన తేజస్సుతో కనిపించును. తిరిగి రాత్రి 7 తర్వాత  అలలు ముందుకు వచ్చేస్తాయి. సాధారణ సమయంలో ఆలయం నీటి క్రింద భాగంలో  ఉంటుంది. Nishkalank Mahadev Temple గోపురం పై భాగం మాత్రమే కనిపిస్తుంది.  ఇక్కడ హారతి సమయం 6.30 నుండి 7వరకు సహజంగా చాలా ఆలయాలు  కొండల్లో కానీ పర్వత ప్రాంతాల్లో కానీ , జలపాతాలుమరియు సరస్సులు సమీపంలో కానీ ఉంటాయి.

కానీ ఈ Nishkalank Mahadev  ఆలయం మాత్రం వాటి అన్నింటికి పూర్తిగా బిన్నంగా  ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన  తర్వాత  పాండవులకు శ్రీ కృష్ణుడు ఇలా చెప్తాడు యుద్ధ రంగంలో తమ దోషాలను, కళంకాలను యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు.

ఆ పాపాల నుంచి విముక్తి చెందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం మీరు  వాటి వెంట వెళ్లమంటాడు. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారుతుందో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని పాండవులకు కృష్ణుడు చెబుతాడు.

కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఎన్నో రోజుల తరబడి వాటి వెంటే వెళుతూ నడిచేవారు. ఎంత దూరం నడిచినా వాటి రంగులో ఎటువంటి మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరతాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారిపోతాయి. అప్పుడు అయిదురుగు అన్నదమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు.

వారి అమోఘమైన భక్తికి మెచ్చిన పరమశివుడు ఒక్కొక్కరి ముందు ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడు. దీనితో పాండవులంతా ఎంతో  ఆనందపడి అక్కడున్న ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కధనం చెబుతోంది. పాండవుల యొక్క పాపాలను కడిగిన ఈ పరమ పవిత్రమైన ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి చెందినది.

Nishkalank Mahadev Tmple
                              Nishkalank Mahadev Temple

Nishkalank Mahadev Temple Timings

అయితే ఈ Nishkalank Mahadev ఆలయం మొత్తం ఉదయం సమయంలో వచ్చే టూరిస్టులకి కానీ భక్తులకి కానీ ఎవ్వరికీ ఇది కనిపించదు. ఆ సమయంలో  ఆలయం మొత్తం నీట మునిగి ఉంటుంది. గుడి పై భాగంలో ఉన్న జండా  మాత్రమే దర్సనమిస్తుంది. ఆ సమయంలో అలలు ఉదృతంగా ముందుకు వస్తాయి. సుమారు 11గంటలకి  అలలు మెల్లగా వెనక్కి వెళ్లిపోతాయి.

ఒంటిగంటకల్లా  మొత్తం అలలు మొత్తం వెనక్కి వెళ్లిపోయి ఆ మహాదేవుడు Nishkalank Mahadev  ఎంతో అద్భుతమైన తేజస్సుతో దర్శనమిస్తారు. ఆ సమయంలో భక్తులందరూ వచ్చి దర్శించుకోవచ్చు . ఇక సాయంత్రం 7 గంటల వరకూ  భక్తులు అక్కడ సమయం గడపవచ్చు. ఆ సమయం దాటిన తర్వాత సముద్రం మళ్ళీ ముందుకు రావడం కొద్ది కొద్దిగా ప్రారంభిస్తుంది.

ఇక్కడ ఆ ఆలయ  మార్గం అంతా నాచుతో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి చిన్న పిల్లలకు అనుమతి లేదు కేవలం పది సంవత్సరాలు దాటిన వాళ్ళకే ప్రవేశం ఇస్తారు. ఆ ఆలయం లో పూజారి అనేవారు ఎవరూ ఉండరు ఎవరికి వాళ్లే సొంతంగా పూజలు చేస్తూ ఉంటారు.

Nishkalank Mahadev ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రతి ఒక్కొక్క శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది. అక్కడి నుండి  భక్తులు ముందుగా పాండవకొలను అని పిలిచే నీటి గుంట దగ్గర వారి కాళ్లను శుభ్రపరచుకుని పూలు, పాలు, పండ్లను తీసుకుని శివలింగాలకు ఎవరికీ వారు స్వయంగా అభిషేకిస్తుంటారు.

ఇక్కడకు ప్రతీ శివ రాత్రి రోజున భక్తులు తెల్లవారు జామునే వచ్చి పరమేశ్వరుని దర్శించుకోవడనికి వేచి చూస్తారు. ఆ అలలు అచటనుండి వెనక్కి వెళ్లే వరకూ ఎంతో అద్భుతంగా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.

ఇటువంటి అద్భుతాన్ని ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారైన తప్పక చూడాలి. ఇక్కడికి మార్చి మరియు జూలై నెలలలో ఈ Nishkalank Mahadev Temple ఆలయాన్ని దర్శించుకునేందుకు ఇది మంచి సమయం. ఇలాంటి  అద్భుతమైన దేవాలయం  కేవలం మన దేశం లో మాత్రమే ఉండటం ఏంటో అత్యంత విశేషం.

     ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కింద ఉన్న ఎమోజీ పై క్లిక్ చేసి మీ అబిప్రాయం తెలపండి.

Read Also….కేదార్‌నాథ్ స్థల పురాణం వినడమే అధృష్ణం..| Kedarnath yatra

Read Also….Dakshinamurthy Stotram | అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి స్తోత్రం

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular