శనివారం, ఏప్రిల్ 20, 2024
HomeసినిమాKanguva Glimpse: అదరగొట్టిన సూర్య విజువల్ వండర్ గా కంగువ గ్లింప్స్

Kanguva Glimpse: అదరగొట్టిన సూర్య విజువల్ వండర్ గా కంగువ గ్లింప్స్

కోలీవుడ్ నటుడు సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ కంగువ ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ మరియు స్టూడియో గీన్ సముక్తంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాకు శివ డైరెక్షన్ వహిస్తున్నారు. రెండు రోజులక్రితం ఈ సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ చెయ్యగా దానికి అనూహ్య స్పందన రావడంతో పాటు ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. అయితే నేడు యాక్టర్ సూర్య పుట్టినరోజు కావడంతో కంగువ నుండి గ్లింప్స్ విడుదల చేసారు చిత్ర యూనిట్.

అయితే రిలీజ్ చేసిన గ్లింప్స్ లో హీరో సూర్య ఒక వారియర్ గెటప్ లో కనిపిస్తున్నాడు గ్లింప్స్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకూ అద్భుతమైన ఔట్ పుట్ అదించారు అంతేకాక ప్రతీ ఫ్రేమ్ గూస్ బంప్స్ వచ్చేలా కట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. గ్లింప్స్ మొత్తం యుద్ధం నేపద్య సీన్స్ ఉండడంతో ఎక్కడా స్టొరీ రివీల్ చెయ్యలేదు డైరెక్టర్.

గ్లింప్స్ ఫస్ట్ నుండి ఎక్కడా సూర్య ఫేస్ ను ఒక మాస్క్ తో కవర్ చేసినట్లు ఉండగా గ్లింప్స్ చివర్లో ఒక 5 సెకండ్స్ సూర్య తన మాస్క్ తీసిన ఒక్క ఫ్రేమ్ మాత్రమే కనిపిస్తుంది. చివరి ఫ్రేమ్ లో సూర్య లుక్ మాత్రం సూపర్ అనే చెప్పాలి కాకపోతే గెటప్ మాత్రం కొంచే గెడ్డం అదీ విక్రమ్ మూవీలో సూర్య చివరి సీన్ లో కనిపించిన విధంగానే ఉంది.

ఇక ఈ గ్లింప్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతీసీన్ ఎలివేట్ అయ్యేలా అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు దేవీ శ్రీ ప్రసాద్. యుద్ద నేపద్యంలో సాగే సినిమా కాబట్టి ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా భారీగానే ఉన్నాయి. తమిళంలో కంగువ అంటే అగ్ని వీరుడు లేదా తెగువ ఉన్న యుద్ద వీరుడు అనే అర్ధంతో ఈ టైటిల్ పెట్టారు చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రం మొత్తం 10 బాషలలో 3D ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా 2024 లో మొదట్లో రాబోతున్నట్లు తెలిపారు. Kanguva Glimpse రిలీజ్ చేసిన 11 గంటల్లో 4 మిలియన్ల్స్ వ్యూస్ మరియు 4.3 లక్షల వ్యూస్ తో యూట్యూబ్ టాప్ 3లో ట్రెండ్ అవుతుంది.

Read More….Project K Glimpse: ఇండియన్ ప్రైడ్ సినిమాగా ప్రాజెక్ట్ కె

Read More….Project k: చిరుత లాంటి చూపులతో సూపర్ హీరోలా ప్రభాస్ ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular