మంగళవారం, జూన్ 18, 2024
Homeక్రీడలుJasprit Bumrah Returns: డైరెక్ట్ కెప్టెన్ చాన్స్ కొట్టేసిన బుమ్రా

Jasprit Bumrah Returns: డైరెక్ట్ కెప్టెన్ చాన్స్ కొట్టేసిన బుమ్రా

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మరియు యార్కర్ల స్పెసలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్నాడు అదికూడా ఏకంగా కెప్టెన్ గా . త్వరలో భారత్ మరియు ఇర్లాండ్ మద్య మూడు T20 మ్యాచ్ ల సిరీస్ ఐర్లాండ్ లో జరగనుండడంతో నిన్న జరిగిన BCCI ప్లేయర్ల సెలక్షన్ లో టీమ్ ఇండియా కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ను సెలక్ట్ చేసింది. ఇక వైస్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను సెలక్ట్ చేసారు.

ముందుగా రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా సెలక్ట్ చేస్తారని అనుకున్నారంతా తాజాగా జరిగిన ఆసియా క్రీడలు 2023 (Asian Games 2023) లో టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కే కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారంతా అయితే సెలక్టర్లు మాత్రం పూర్వం బుమ్రా కెప్టెన్సీ చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తనకే సారద్య బాధ్యతలు కట్టబెట్టారు.

ఇప్పటికే గాయాల నుండి కోలుకున్న బుమ్రా డైరెక్ట్ గా ఐర్లాండ్ మ్యాచ్ ఆడనున్నాడు అంతే కాక ఇప్పుడు వెస్ట్ ఇండీస్ టీమ్ లో ఆడుతున్న పలువురు ప్లేయర్లు ఐర్లాండ్ T20 సిరీస్ కి కూడా సెలెక్ట్ అవ్వడంతో ఆగష్ట్ 18 నుండి జరిగే T20 మ్యాచ్ లకు ఆడదానికి డైరెక్ట్ గా వెస్ట్ ఇండీస్ నుండి ఐర్లాండ్ చేరుకుంటారు. అయితే ఈ సిరీస్ లో మొత్తం యువ ఆటగాళ్ల కే అవకాశం ఇచ్చింది BCCI. ఇక టీమ్ ఆటగాళ్ల విషయానికి వస్తే

జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)

రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్)

తిలక్ వర్మ

యశస్వి జైస్వాల్

సంజూ శాంసన్ (వికెట్ కీపర్)

రింకూ సింగ్

జితేష్ శర్మ (వికెట్ కీపర్)

శివం దూబే

వాషింగ్టన్ సుందర్

రవి బిష్ణోయ్

షాబాజ్ అహ్మద్

ప్రసిద్ కృష్ణ

ఆర్షదీప్ సింగ్

ఆవేష్ ఖాన్

ముకేష్ కుమార్

మొత్తం 15 మంది ప్లేయర్లను ఈ సిరీస్ కోసం సెలక్ట్ చేసింది BCCI. అయితే ఆగష్ట్ 18న మొదటి T20 జరగనుండగా 20న రెండో T20, ఆగష్ట్ 23న మూడో T20 జరగనుంది. మూడు మ్యాచ్ లు ఒకే స్టేడియం మలహైడ్ డబ్లిన్ స్టేడియంలో ఈ మూడు మ్యాచ్ లు జరగనున్నాయి.

Read Also….T20 మ్యాచ్ లో 7 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ కొట్టిన సియాజ్రుల్ ఇడ్రస్ 

Read Also….కిటికీలోంచి తొంగి చూడడంపై రోహిత్ శర్మ ను ఆడుకుంటున్న నెటిజన్లు..!

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular