మంగళవారం, జూన్ 18, 2024
Homeక్రీడలుT20 మ్యాచ్ లో 7 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ కొట్టిన సియాజ్రుల్ ఇడ్రస్

T20 మ్యాచ్ లో 7 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ కొట్టిన సియాజ్రుల్ ఇడ్రస్

ఐసీసీ క్రికెట్ ఆసియా రీజనల్ క్వాలిఫైర్ బి టోర్నమెంట్ జరుతున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు చిన్న జట్లు అయినా కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరి ద్రుష్టి వీటిపై పడింది దీనికి ప్రధాన కారణం మలేషియన్ పాస్ట్ బౌలర్ సియాజ్రుల్ ఇడ్రస్. 2019 T20 మ్యాచ్ తో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన సియాజ్రుల్ ఇడ్రస్ తాజాగా చైనా మరియు మలేషియా జట్ల మద్య క్వాలిఫయర్ బి T20 మ్యాచ్ లో సియాజ్రుల్ ఇడ్రస్ తన బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ చైనా జట్టు టాప్ ఆర్డర్స్ మొత్తం కూలగోట్టాడు.

చైనా మరియు మలేషియా మద్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఏడు వికెట్లు తీసి అబ్బురపరిచాడు. నాలుగు వోవర్లు వేసి 8 రన్స్ ఇచ్చి 7వికెట్లు తీసాడు. సియాజ్రుల్ ఇడ్రస్ బౌలింగ్ ధాటికి చైనా టాప్ ఆర్డర్లు ఎంతో సేపు నిలువలేకపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లే పెవీలియన్ కు పంపించాడు.

సియాజ్రుల్ ఇడ్రస్ దీనితో చైనా 11.2 వవర్లకి 23 రన్స్ తో ఆల్ అవుట్ అవ్వగా తరువాత బ్యాటింగ్ చేసిన మలేషియా జట్టు 4.5వవర్లకు 2వికెట్లు నష్టపోయి 24పరుగులు చేసి విజయం సాదించింది. దీనితో ఒక్కసారిగా మలేషియా జట్టు తో పాటు బౌలర్ సియాజ్రుల్ ఇడ్రస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular