శుక్రవారం, జూలై 26, 2024
Homeఅంతర్జాతీయంIsrael Palestine War: ఇజ్రాయెల్ పై దాడి వెనుక ఇంత కుట్ర ఉందా.!

Israel Palestine War: ఇజ్రాయెల్ పై దాడి వెనుక ఇంత కుట్ర ఉందా.!

Israel Palestine War : ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. అసలు ఈ యుద్ధం జరిగిన రోజు నుండి ఇప్పటి వరకూ అనేక నేవ్వెరపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. పూర్తి వివరాలతో వెళితే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా గొడవ ఈ నాటిది కాదు ఏకంగా 100 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నే స్థాయికి చేరాయి. అయితే ఈ వివాదాలు, దాడులు కొనసాగుతున్నప్పటికీ గత శనివారం పాలస్తీనా ఉగ్ర మూక ఇజ్రాయెల్ పై చేసిన దాడికి ప్రపంచ దేశాలు నేవ్వెర పోతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ సాధారణ దేశం అయితే కాదు టెక్నాలజీ లోనూ, డిఫెన్స్, వ్యవసాయం, ఎడ్యుకేషన్ వంటి అధునాతన పద్దతులతో ప్రపంచ దేశాలలో ముందు వరుసలో ఉంది.

ప్రపంచంలో టాప్ 5 గా ఇజ్రాయెల్ గూడచర్య సంస్థ మొసాద్

ఇక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ లో ముఖ్యంగా మొసాద్ ఒకటి ప్రపంచ దేశాలలో US, UK, Russia తరువాత 5వ స్థానంలో ఉంది మొసాద్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. మొసాద్ పేరు వింటేనే చాలా దేశాలకు వెన్నులో వణుకు పుడుతుంది. దీనికి కారణం ప్రపంచ దేశాలలో ఉన్న వీరు చేసే గూఢచర్యం తో ఆయా దేశాలలో ఎలాంటి ఉగ్ర కదలికలు జరుగుతున్నాయి, తీవ్రవాద కదలికలు ఎలా ఉన్నాయి, అణ్వాయుధ నిల్వల పరిస్థితి వంటి కదలికలను గుట్టు చప్పుడుకాకుండా సమాచారం సేకరిస్తారు.

ఇజ్రాయెల్ పై దాడిని అరికట్టడంలో విఫలమైన మొసాద్

అసలు ఈ మొసాద్ సంస్థ 1949-1951 మధ్య విదేశాంగ శాఖ పరిధిలో ఉండేది తరువాత మొసాద్ ను 1951 నుండి డైరెక్ట్ గా ప్రధాన మంత్రి కి అటాచ్ చేశారు. అంటే ఈ మొసాద్ ఇంటెలిజెన్స్ సంస్థ ప్రధానిమంత్రికి తప్ప ఇంకెవ్వరికీ సమాధానం చెప్పనవసరం లేదు వీళ్ళ గురించి ఇంకెవ్వరి దగ్గరా పెద్దగా సమాచారం ఉండదు. ఇజ్రాయెల్ మొసాద్ ను US కు చెందిన CIA తో పోలుస్తారు. ఇప్పటివరకూ మొసాద్ గురించి ఎందుకు చెప్పానని అనుకుంటున్నారా అసలు విషయం ఇక్కడే ఉంది. ఇజ్రాయెల్ లో ఇంత జరుగుతున్నా మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ సంస్థ పూర్తిగా విఫలం అయ్యిందనే చెప్పాలి.

పూర్తి వ్యూహంతో పాలస్తీనా మిలిటెంట్ల దాడి 

ఎందుకంటే పక్కనే ఉన్న పాలస్తీనా లోని గాజా స్ట్రిప్ నుండి అక్టోబర్ 07, 2023 వ తేదీన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ 20 నిమిషాలలోనే ఏకంగా 5000 మిసైల్స్ తో ఇజ్రాయెల్ లోని మేజర్ సిటీస్ పై ఏక కాలంలో దాడి చేసింది. అసలు దాడి చేసిన తరువాత కూడా ఇజ్రాయెల్ ఆర్మీ లో సైతం సరైన కమ్యునికేషన్ లేదనే వార్తలు వినిపించాయి.

ఇజ్రాయెల్ సైన్యంలో కొంత సేపు గందరగోళ పరిస్థితి

చాలా సేపటి వరకూ సైన్యం లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దీనికి కారణం హమాస్ మిలిటెంట్ లు మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ కు చెందిన కమ్యునికేషన్ వ్యవస్థలపై దాడికి పాల్పడడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఆర్మీ చేరుకునే లోపు హమాస్ మిలిటెంట్ గ్రూప్ లో మొత్తం 1000 మంది ఒక్కసారిగా ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి లోనికి వచ్చి దొరికిన వారిని దొరికినట్లు హతమార్చారు. అంతేకాక ఇజ్రాయెల్ మరియు గాజాకి దగ్గరగా ఉన్న Re’im అనే ప్రదేశంలో ఒక సూపర్ నోవా మ్యూజికల్ ఫెస్టివల్ జరుగుతున్న తరుణంలో అక్కడికి బారీ యెత్తున మ్యూజిక్ ప్రియులు హాజరయ్యారు.

బందీలుగా 150 మంది ప్రజలు

వీరిలో ఇజ్రాయెల్ వాసులతో పాటు ఇతర దేశస్థులు కూడా ఇక్కడి మ్యూజిక్ ఫెస్టివల్ కి హాజరయ్యారు. ఈ ఫెస్టివల్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 6 వరకూ జరిగింది. అయితే ఇదే అదునుగా హమాస్ మిలిటెంట్లు పేరాశూట్, పేరాగ్లైడ్ వాహనాలు వేసుకొని ఆకాశమునుండి డైరెక్ట్ గా మ్యూజిక్ ఫెస్టివల్ ప్రాంతంలోకి చొరబడి ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ప్రజలను చుట్టుముట్టి ఏక ధాటిగా 250 మందిపై కాల్పులు జరిపుతూ విచక్షణారహితంగా చంపారు. అంతేకాక సుమారు 150 మందికి పైగా అపహరించి తీసుకుని వెళ్ళిపోయి వారిని బందీలుగా చేశారు.

మిస్సైల్స్ దాడి వెనుక అనుమానాలు

అసలు హమాస్ మిలిటెంట్ సంస్థకు ఇంత పెద్ద ఎత్తున 5000 మిస్సైల్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎన్ని నెలల నుండి ఈ ప్లాన్ చేస్తున్నారు, ఈ మిస్సైల్స్ ఎదేశం నుండైనా వచ్చాయా అని నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇన్ని మిస్సైల్స్ గాజా బోర్డర్ వద్దకు తరలించినా ఇజ్రాయెల్ నిగా సంస్థ మోసాద్ పసిగట్టడంలో ఎలా విఫలం అయ్యింది అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

పాలస్తీనాను నమ్మి మోసపోయిన ఇజ్రాయెల్

అయితే ఇజ్రాయెల్ పై దాడి జరగడంలో ఇజ్రాయెల్ పాలస్తీనాను గుడ్డిగా నమ్మడమేనని తెలుస్తోంది. గత కొంత కాలంగా పాలస్తీనా వాసులు ఇజ్రాయెల్ వచ్చి ఇక్కడే పని చేసుకుంటూ ఉండడం ఇజ్రాయెల్ కు ఎలాంటి అనుమానం రాకుండా బారీ సంఖ్యలో పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ లో బతకడానికి వచ్చామనే రీతిలో ఇజ్రాయెల్ ను నమ్మించగలిగారు చివరికి ఇజ్రాయెల్ పై ఒక్కసారిగా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. అయితే ఇజ్రాయెల్ మాజీ ఆర్మీ అధికారులు సైతం ఈ విషయం లో ఓపెన్ గానే చెబుతున్నారు మేము నమ్మి మోసపోయామని.

40 మంది చిన్నపిల్లల నరమేధం

హమాస్ ఉగ్రవాదులు 40 మంది చిన్న పిల్లల తలలు నరికి హేయమైన చర్యకు పాల్పడడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యాయి.

Read Also..ఇజ్రాయెల్ యుద్ధం చాలా బయానకంగా ఉంది నటి నుష్రత్ భరుచ్చా

Read Also.. MQ-9 డ్రోన్ పై రష్యా యుద్ధవిమానంతో ఎటాక్ చేసి కూల్చివేసిందంటూ వీడియో రిలీజ్ చేసిన అమెరికా

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular