మంగళవారం, మార్చి 19, 2024
Homeఅంతర్జాతీయంMQ-9 డ్రోన్ పై రష్యా యుద్ధవిమానంతో ఎటాక్ చేసి కూల్చివేసిందంటూ వీడియో రిలీజ్ చేసిన అమెరికా

MQ-9 డ్రోన్ పై రష్యా యుద్ధవిమానంతో ఎటాక్ చేసి కూల్చివేసిందంటూ వీడియో రిలీజ్ చేసిన అమెరికా

అమెరికా మరియు రష్యా మద్య జగడం మరింత ముదిరింది తాజాగా అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ నల్ల సముద్రం గా పిలిచే (Black Sea) లో కుప్పకూలడంతో ఒక్క సారిగా అమెరికా అప్రమత్తమయ్యింది. దీనిలో బాగంగా ఈ డ్రోన్ కూలిపోవడానికి ముందు జరిగిన ఘటనను తాజాగా అమెరికా బయటకు రిలీజ్ చెయ్యడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాయి.

పూర్తి వివరాలలోకి వెళితే తాజాగా అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ నల్ల సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో రష్యాకు చెందిన Sukhoi Su-27 యుద్ధవిమానం అమెరికాకు చెందిన MQ-9 డ్రోన్ పై ఇంధనాన్ని జారవిడవడంతో డ్రోన్ కేమేరాపై ఇంధనం పడి కెమెరా పనిచెయ్యలేదు అయితే కొంత దూరం అలాగే వెళ్ళింది కానీ రష్యా కు చెందిన మరో యుద్ధ విమానం అమెరికన్ డ్రోనే యొక్క ప్రోపెల్లెర్ ను బలంగా డీకొట్టడంతో సమీపంలో లాండింగ్ చేయడం కుదరలేదు దీనితో అది నల్ల సముద్రంలో కుప్పకూలిపోయింది.

అయితే రష్యా కావాలనే తమ డ్రోనే పై దాడి చేసిందని అమెరికా అనడంతో రష్యా మాత్రం తమ యుద్ధ విమానాలు హెచ్చరికలు మాత్రమె చేసామని తాము ఎలాంటి మిసయిల్స్ ప్రయోగించలేదని చెబుతోంది. అంతేకాక అమెరికా డ్రోన్ నల్ల సముద్రం మీదుగా క్రిమియా వైపు వస్తున్న తరుణంలో ఇలాంటి హెచ్చరికలు చేసామని చెబుతోంది. అయితే అమెరికా డ్రోన్ కూలిపోయే ముందు జరిగిన ఘటన యొక్క వీడియో ఫుటేజ్ బయటకు రిలీజ్ చేసింది అమెరికా.  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular