ఆదివారం, మే 26, 2024
Homeసినిమాఇజ్రాయెల్ యుద్ధం చాలా బయానకంగా ఉంది నటి నుష్రత్ భరుచ్చా

ఇజ్రాయెల్ యుద్ధం చాలా బయానకంగా ఉంది నటి నుష్రత్ భరుచ్చా

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మద్య జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోన్న తరుణంలో బాలివుడ్ కు చెందిన హీరోయిన్ నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయారు అక్కడి భయానక వాతావరణాన్ని నటి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

పూర్తి వివరాలలోకి వెళితే భాలివుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్ లో జరుగుతున్న Haifa ఫిల్మ్ అవార్డ్స్ నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్ళడంతో అదే సమయంలో ఆదేశంలో ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మద్య యుద్ధం మొదలైంది దీంతో అక్కడే చిక్కుకుపోయిన నటి నుష్రత్ భరుచ్చా తాను శనివారం ఇండియాకు తిరిగి ప్రయాణం అవుదామని అనుకున్న తరుణంలో తెల్లవారు జామున బాంబు శబ్దంతో చెవులు చిల్లులు పడ్డాయని తెలిపారు.

మేము ఇండియాకు తిరిగి వద్దామని అనుకున్నప్పటికీ ఇప్పటికీ నగరం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని, నగరం మొత్తం చిన్నా బిన్నం అయ్యిందని, అక్కడ మిసైల్ పడే ముందు వచ్చే శభ్దాలతో మరియు మిసైల్ పడ్డాకా పేలుడు శబ్దాలతో బయానక వాతావరణం కనిపించిందని తెలిపారు.

మమ్మల్ని దగ్గరలోని షెల్టర్ లోకి తరలించారని చెప్పింది నుష్రత్ భరుచ్చా తాను దగ్గరలో ఉన్న ఇండియన్ ఎంబసీ కి కూడా వెళ్ళలేక పోయామని తెలిపింది.అంతేకాక విమానాశ్రయానికి వెళ్ళే వాహనాలను పెల్చేస్తున్నా ఎలాగోలా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇండియాకు వచ్చేసానని చెప్పింది నుష్రత్ భరుచ్చా.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular