ఆదివారం, జూలై 21, 2024
Homeసినిమాషారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లకు నోటీసులు జారీ చేసిన హైకోరు

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లకు నోటీసులు జారీ చేసిన హైకోరు

బాలివుడ్ నటులపై ఎప్పుడూ వార్తల్లో ఎదోక వివాదం సెలరేగుతూనే ఉంటుంది. తాజాగా బాలివుడ్ సీనియర్ యాక్టర్స్ అయిన షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ల “జుబాన్ కేసరి” పాన్ మసాలా యాడ్ పై ఇప్పుడు వివాదం చెలరేగింది. అయితే ఇప్పుడు ఈ విషయం ఏకంగా అలహాబాద్ హైకోర్టు వీరికి నోటీసులు ఇచ్చే దాకా వచ్చింది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ల గుట్కా యాడ్ పై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే నిమిష నిమిషానికి ఈ యాడ్ తో ఊదరగొడుతున్నారు.

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లకు నోటీసులు

పూర్తి వివరాలలోకి వెళితే సుమారు మూడు దశాబ్దాలుగా బాలివుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఉంటూ మేము కింగ్ ఖాన్స్..మేము తురుములం అని చెప్పుకు తిరిగే వీళ్ళు గుట్కా యాడ్స్ చేస్తూ ప్రజల మరియు యువతతో పాటు చివరికి వీరి ఫ్యాన్స్ కు ఇలాంటి తప్పుడు సందేశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ప్రస్తుతం ఈ గుట్కా యాడ్స్ ఇస్తున్న ఈ ముగ్గురిపై హైకోర్టుకు వెళ్ళిన లాయర్ సినిమా ఇండస్ట్రీలో గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న వీరు ఇప్పటికే వీరికి పలు అవార్డులు ఇచ్చి భారత దేశం వీరిని సత్కరించింది. అయితే వీళ్ళు మాత్రం “జుబాన్ కేసరి” వంటి హానికారక యాడ్స్ ఇస్తున్నారు.

అవార్డ్స్ వెనక్కి తీసుకోవాలన్న లాయర్

ఇలాంటి వారికి ఇచ్చిన అవార్డ్స్ ను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోకూడదు అంటూ కోర్టులో పిల్ వెయ్యగా హైకోర్టు కేంద్ర ప్రహుత్వాన్ని వెంటనే సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది. అయితే గవర్నమెంట్ అఫీషియల్స్ కోర్టుకు ఇలా బదులిచ్చింది ఇప్పటికే ఇదే విషయంపై సుప్రీం కోర్టులో కేసు పై నడుస్తున్నందున ఫిటిషన్ ను కొట్టివెయ్యాలని సూచించింది. దీనితో కోర్టు ఈ కేసుని మే-9 కి వాయిదా వేసింది.

గతంలో అక్షయ్ కుమార్ క్షమాపణలు 

అయితే కోర్టు విషయం ఎలా ఉన్నా ఈ ముగ్గురిపై ప్రజా సంఘాల నుండి మరియు పలువురి నేతల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాడ్ లలో మొదటగా షారుఖ్ ఖాన్, విజయ్ దేవగన్ చెయ్యగా వారు పట్టించుకోలేదు అయితే ఈ బ్యాచ్ లోకి క్లీన్ ఇమేజ్ ఉన్న అక్షయ్ కుమార్ ను లాగడంతో తీవ్ర విమర్శలు రావడంతో మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి ఇకపై ఈ యాడ్స్ చెయ్యనని, ప్రస్తుతం సంవత్సరం న్నర వరకూ అగ్రిమెంట్ ఉందని తరువాత చెయ్యనని చెప్పాడు.

బాద్యత లేకుండా ప్రవర్తిస్తున్న షారుఖ్, అజయ్ దేవగన్

అయితే ఇప్పటికీ తాను చేసిన పాన్ యాడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక షారుఖ్ ఖాన్ అయితే నిసిగ్గుగా ఇలాంటి వాటిని పట్టించుకోడనే విమర్శలు ఉన్నాయి షారుఖ్ చేసే వాటిలో దాదాపు అన్నీ ఇలాంటివే వాటిలో మద్యం యాడ్, డ్రింక్ యాడ్, పాన్ మసాలా వంటి యాడ్స్ పై జనాలు విమర్శలు చేస్తున్నారు. తమ కుటుంభాలు నాశనం అవుతున్నాయని తెలిసీ తెలియని వయసులో హీరోలను చూసి ఇలాంటివి అలవాటును చేసుకుంటున్నారని ప్రజలనుండి సైతం విమర్శలు వస్తున్నాయి.

ప్రజల నుండి తీవ్ర విమర్శలు

ఒకవైపు ప్రభుత్వం డబ్బు ఖర్చుచేసి వీటి బారిన పడకుండా ప్రజలను చైతన్యపరుస్తుంటే వీరు మాత్రం డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. నార్త్ సైడ్ అయితే ఈ పాన్ మసాలా తిని రోడ్ల మీద, రైల్వే స్టేషన్ ల మీద ఉమ్మె వాటిని ప్రభత్వం క్లీన్ చెయ్యించడానికే సంవత్సరానికి కొట్లలో ఖర్చు చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Read Also: Prabhas New Look: ప్రభాస్ లుక్ అదిరిపోయింది భాసూ

Read Also: Salaar Trailer Review: ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ట్రైలర్ తో సమానంగా

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular