బుధవారం, జూలై 17, 2024
HomeసినిమాSalaar Trailer Review: ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ట్రైలర్ తో సమానంగా

Salaar Trailer Review: ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ట్రైలర్ తో సమానంగా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ సలార్ పలుమార్లు వాయిదాల అనంతరం, ప్రభాస్ ఫాన్స్ అత్యంత నిరీక్షణ అనంతరం నేడు 07:19 నిమిషాలకు Hombale
ఫిలిమ్స్ ఈ ట్రైలర్ ను ఎట్టకేలకు రిలీజ్ చేసింది.

Salaar Trailer Review

సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ మొత్తం 03 నిమిషాల 47 సెకెన్డ్స్ కొనసాగిన ఈ ట్రైలర్ ఎలా ఉంది, ప్రభాస్ లుక్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ఇతర నటీనటులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజుక్, మాస్ ఎలివేషన్స్ వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Salaar Trailer Story

ట్రైలర్ స్టార్ లో ప్రభాస్ (దేవ) మరియు పృద్విరాజ్ (వరదరాజ్) చిన్నప్పటి స్నేహితుల కేరెక్టర్స్ చూపించారు అంతేకాక చిన్నప్పటి కేరెక్టర్ లో ప్రభాస్ ఒక డైలాగ్ లో “నీకోసం ఎరైనా అవుతా లేదా సొరైనా అవుతా” అనే డైలాగ్ తో స్టార్ అవుతుంది దీనితోనే ఈ సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితుల నేపద్యంలో తెరకెక్కిన సినిమా అనేది అర్ధం అవుతుంది.

తరువాత ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి రాజమన్నార్ (జగపతిబాబు) తన కొడుకు వరదరాజ్ ను అధిపతిని చెయ్యాలనుకుంటాడు అయితే ఇదే ట్రైలర్ లో చాలావరకూ మిగతా కేరేక్తర్లు అన్నీ చూపించి వరదరాజ్ ను ఎలా బందీగా చేసి తనను అడ్డుతోలగించడానికి చూస్తారు ఇదే మొత్తం కథగా తెలుస్తోంది.

Prashantha Neel Direction

ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి చెప్పాలంటే ప్రతీ ఫ్రేమ్ ఒక అద్భుతమనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకూ అన్నిసినిమాలకూ ఒక యూనివర్స్ కోడ్ లాగ తనకు ఒక యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. వాటిలో ఎక్కువగా బ్లాక్ షేడ్ స్క్రీన్, హీరో ఎలివేషన్, ఎలివేషన్స్ కి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి సుమారు ప్రతీ సినిమాలో ఫాలో అవుతుంటాడు. ఈ సినిమాలో కూడా ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించాడు.
Prabhas Look
ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల కటౌట్ కి సరైన సినిమా దొరికిందని చెప్పుకునే లా ఉంది ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ ఆదరగోట్టేసింది. డైలాగ్స్ తో పాటు ఫైట్స్ ఆకట్టుకున్నాయి ఆక చివరలో వచ్చే
ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అనే డైలాగ్ లో ప్రభాస్ ఎక్ష్ప్రెషన్స్ మాత్రం గూస్బంప్స్.

Salaar Cast & Crew
నటీనటులు నటీనటుల విషయానికి వస్తే జగపతి బాబు, గరుడ, బోబి సింహ, సృతిహాసన్ వంటి అనేక మంది నటీనటులు ఉన్నా ఒక్కొక్కరికీ మంచి కేరెక్టర్స్ లబించినట్లే తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ట్రైలర్ తో సమానంగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి లేటైనా మంచి యాక్షన్ ప్యాక్ మూవీ వచ్చిందనే ఫీల్ మాత్రం పక్కా.

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/4GPvYMKtrtI?si=sBqhNhLgEfpEPy09″ title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share” allowfullscreen></iframe>

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular