బుధవారం, జూలై 17, 2024
Homeసినిమాప్రభాస్ కు అంత సీన్ లేదు...సలార్ కు సవాల్ విసిరిన బాలివుడ్ డైరెక్టర్

ప్రభాస్ కు అంత సీన్ లేదు…సలార్ కు సవాల్ విసిరిన బాలివుడ్ డైరెక్టర్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఎదుగుదల ను కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి ఉదాహరణే బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తాజాగా ప్రభాస్ పై మరియు ఆదిపురుష్ సినిమాపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను దేవుడిగా చేసే సినిమాలో రాత్రంతా తప్పతాగి ఉదయం లేచి నేను దేవుణ్ణి అంటే ఎవ్వరూ నమ్మరు అంటూ దీనికి ఉదాహరణే ఆదిపురుష్ సినిమా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అంతేకాక అసలు ప్రభాస్ నటుడే కాదని అన్నాడు. అంతేకాక తాను కాశ్మీర్ ఫైల్స్ సినిమా రిలీజ్ చేసినప్పుడు ప్రభాస్ రాదేశ్యామ్ సినిమా రిలీజ్ అయ్యిందంటూ రెండు సినిమాల మధ్య క్లాష్ లో రాదేశ్యామ్ వోడిపోయిందని కాశ్మీర్ ఫైల్స్ సినిమా గెలిచిందని అన్నాడు.

అంతేకాక మరోసారి సలార్ సినిమాకు పోటీగా తన సినిమా The Vaccine War రాబోతోందని ఈసారి కూడా ప్రభాస్ సలార్ సినిమా పై గెలుస్తామని అన్నాడు వివేక్ అగ్నిహోత్రి. ప్రస్తుతం ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ క్రిటిక్స్ మండిపడుతున్నారు బాలీవుడ్ డ్రగ్ మాఫియాగా తయారైందని ముందు మీది మీరు చక్కబెట్టుకోండని, అయినా హేట్ స్టోరీ లాంటి సినిమా తీసిన నీతో డైరెక్టర్లు నేర్చుకోవాలా అంటూ ఈ సారి నువ్వు ఆకలిమీద ఉన్న డైనోసర్ తో పెట్టుకుంటున్నవ్ దాని పాదాల కింద నలిగిపోతావ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పై మండిపడుతున్నారు.

Read Also…ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఖాతాలపై కాపీరైట్ స్ట్రైక్స్ వేసిన వైజయంతి మూవీస్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular