శనివారం, జూలై 27, 2024
Homeసినిమాతమిళ సినిమా ఇండస్ట్రీలో కొత్త రూల్స్..రూల్స్ మీరితే క్రమశిక్షణా చర్యలు

తమిళ సినిమా ఇండస్ట్రీలో కొత్త రూల్స్..రూల్స్ మీరితే క్రమశిక్షణా చర్యలు

తమిళ చిత్ర పరిశ్రమ Kollywood లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది తాజాగా అంతేకాక తమిళుల వ్యవహార శైలి కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళ ఆలోచనలు చాలా బిన్నంగా ఉంటాయి. ఒక విదంగా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతారు తప్ప మిగతా విషయాలు అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంతేకాక వాళ్ళ కట్టు, బొట్టు, సంస్కృతి వీటిలో అస్సలు రాజీపడరు ముఖ్యంగా ఆత్మాభిమానంతో పాటు స్వార్ధం కూడా వీళ్ళకి మరీ ఎక్కువ. తాజాగా తమిళనాడులోని సినిమా ఇండస్టీ లో పలు మార్పులు చేసింది kollywood లో FEFSI (Film Employees Federation of South India) తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన ఎంప్లాయిస్ కు సంబందించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది.

దీనిలో ఇకపై తమిళ సినిమాల హూటింగ్ లలో తమిళ ఆర్టిస్టులను మాత్రమే తీసుకోవాలని, ఇకపై ఇండియాలో షూటింగ్ జరిగే తమిళ సినిమాలను ఇకపై తమోలనాడులో మాత్రమె షూటింగ్ జరపాలి, మరీ అవసరం అయితే తప్ప బయటి రాష్ట్రం లో గాని బయటి దేశాల్లో గాని ఇకపై షూటింగ్ చెయ్యకూడదు.

అంతేకాక షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా, అనుకున్న బడ్జెట్ దాటిపోయినా తగిన కారణాలతో నిర్మాతకు లిఖిత పూర్వఖంగా సమాచారం ఇవ్వాలి అంటూ FEFSI కొత్త రూల్స్ పెట్టింది. దీనితో ఇతర ఇండస్ట్రీ లలో చేస్తున్న ఆర్టిస్టులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. తాజాగా తమిళ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాలపై పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు.

బ్రో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తమిళ ఇండస్టీ గురించి మాట్లాడుతూ ఇప్పటికైనా తమిళ సినిమాలలో తమిళులు మాత్రమే నటించాలనే ఆలోచనాదోరని నుండి బయటకు రావాలని, తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుందని అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమ కూడా ఉండాలని కోరారు. తమిళ పరిశ్రమలో తమిళులే చెయ్యాలంటే చిత్ర పరిశ్రమ ఎదగదని టాలివుడ్ కూడా అందర్నీ తీసుకోవడం వల్లే ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగిందని అన్ని భాషలు, అందరి కలయికతోనే అది సినిమా అవుతుందని అన్నారు.

Read Also..ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఖాతాలపై కాపీరైట్ స్ట్రైక్స్ వేసిన వైజయంతి మూవీస్

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular