ఆదివారం, జూలై 21, 2024
HomeసినిమాSalaar: సలార్ మూవీపై మరీ ఇంత డర్టీ పాలిటిక్స్...!

Salaar: సలార్ మూవీపై మరీ ఇంత డర్టీ పాలిటిక్స్…!

ప్రభాస్ హీరోగా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియన్ యాక్షన్ త్రిల్లర్ సలార్ ఈ సంవత్సరం చివర్లో ప్రేక్షకుల్లో అత్యంత పాపులారిటీ సాదించిన సినిమాలలో సలార్ ఒకటి ఈ సినిమాకు ఉన్న బజ్ ఎలా ఉందో తెలియాలంటే నిన్న రిలీజ్ చేసిన టికెట్స్ విసయంలోనే అర్ధమైంది. పెట్టిన టిక్కట్లే పెట్టినట్లే కొన్ని నిమిషాలలోనే ఖాళీ అయిపోయాయి. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

అయితే బాలివుడ్ లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి బిన్నంగా ఉంది. బాలివుడ్ హీరో షారుఖ్ ఖాన్ డుంకీ రిలీజ్ అవడంతో సలార్ మరియు డుంకీ మద్య క్లాష్ రావడంతో
బాలివుడ్ లో డుంకీ మరియు సలార్ సినిమాల దియేటర్ల విషయంలో వివాదం చెలరేగింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న సలార్ కు తెలుగులో ఎలాంటి డోకా లేదు కాకపోతే బాలివుడ్ బడా బాబులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి సలార్ కు దియేటర్లు ఇవ్వకుండా అడ్డుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

బాలివుడ్ లో PvR సంస్థ మొత్తం దియేటర్లు డుంకీకి ఇచ్చి సలార్ కు బ్లాక్ చెయ్యడం మరింత వివాదం ముదిరింది. ఇక PVR ఏకంగా డైరెక్ట్ గానే డుంకీ ని మరియు షారుఖ్ ను ప్రమోట్ చెయ్యడంతో చివరకు సలార్ టీం రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీనితో మొత్తం PVR INOX నుండి సలార్ షోస్ కేన్సిల్ చెయ్యాలని బావించారు చిత్రయూనిట్ అయితే PVR సంస్థ మాత్రం తమకు TOLLYWOOD లో డుంకీ కి 50 శాతం ఇవ్వాలని డుంకీ కి ఇవ్వాలని కోరారు దీనితో ససేమిరా అనగా సింగల్ స్క్రీన్స్ లో రిలీజ్ కు రడీ అయ్యారు.

మొత్తం ఈ వ్యవహారాన్ని షారుఖ్ వెనకుండి నడిపించాడని ఆరోపిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ షారుఖ్ తో క్లాష్ వచ్చే ఏ సినిమాని అయినా తన డర్టీ పాలిటిక్స్ తో సినిమాకి దియేటర్స్ దొరక్కుండా అడ్డుకుంటాడని, బాలివుడ్ లో షారుఖ్ ఒక కార్పోరేట్ మాఫియా లాగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటి ట్రిక్స్ ప్రభాస్ ముందు పనిచేయ్యవని నిరూపించారు రెబల్ ఫ్యాన్ సలార్ కు దియేటర్స్ రాకుండా అడ్డుకున్న PVR పై విరుచుకు పడ్డారు.

ఏకంగా #BoycottPVRInox తో ట్విట్టర్ లో PVR సంస్థపై మోత మోగించారు ఏకంగా ఈ హ్యాష్ టాగ్ సుమారు 48 గంటలపాటు ట్రెండింగ్ లో ఉందంటే పరిస్థితి ఎలా ఉందొ అప్పటికే PVR కు అర్ధమైంది. సోషల్ మీడియా దెబ్బతో చివరికి దిగొచ్చిన PVR సంస్థ నాట్ ని రిలీజ్ చేస్తూ ప్రభాస్ సలార్ పాన్ ఇండియా సినిమా అంటూ అదొక యాక్సన్ చిత్రం అంటూ ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది.

ఇప్పటికే బాలివుడ్ లో చాలా సినిమాలు షారుఖ్ పాలిటిక్స్ దెబ్బకి నానా తంటాలు పడుతున్నారు. సినిమా రిలీజ్ తరువాత కూడాపెయిడ్ రివ్యూస్ తో సినిమాని వీళ్ళే శాసిస్తున్నారని ఇప్పటికే షారుక్ డర్టీ పాలిటిక్స్ తో దెబ్బతిన్న బాలివుడ్ బాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని పాలిటిక్స్ చేసినా సలార్ ముందు కుప్పిగంతులు సాగడం లేదు.

Read Also…షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లకు నోటీసులు జారీ చేసిన హైకోరు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular