ఆదివారం, మే 26, 2024
Homeభక్తిShani Trayodashi 2023: శని భాదలు తీరి ఏలినాటి శని పోవాలంటే ఇలా చెయ్యండి

Shani Trayodashi 2023: శని భాదలు తీరి ఏలినాటి శని పోవాలంటే ఇలా చెయ్యండి

Shani Trayodashi 2023 శనివార త్రయోదశీ యుక్త ప్రదోష వ్రతాన్ని శనిత్రయోదశి అని అంటారు. అయితే ప్రతీ సంవత్సరంలో త్రయోదశి మూడు లేదా నాలుగు సార్లు వస్తుంది. అయితే త్రయోదశి లో వచ్చే శనివారాన్ని శని త్రయోదశి అంటారు. దీనిని అలభ్య యోగం అని కూడా అంటారు.

అసలు త్రయోదశి ఎంతో అద్భుతమైనది అలాంటి త్రయోదశికి శనివారం కూడా రావడం మరింత విశిష్టంగా చెబుతారు. Shani Trayodashi 2023 మొత్తం సంవత్సరం ఇదు సార్లు రావడం జరిగింది అవి ఫిబ్రవరి 18 జూలై 1 జులై 15 నవంబర్ 11 నవంబర్ 25 తేదీలలో Shani Trayodashi రావడం జరిగింది.

అసలు శనిత్రయోదశి వెనుక ఒక పురాణ కధ ఉంది. నారద మహర్షి ఒక సారి కైలాశంలో ఉన్న శివుని వద్దకు వెళ్లి శనీశ్వరుని శక్తి గురించి వర్ణిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు నారదునితో శానేశ్వరుడికి అంత బలవంతుడే అయితే తనని పట్టి పీడించమనగా అక్కడకు వచ్చిన శనేశ్వరుడు పరమేశ్వర నిన్ను క్షణ కాలం పట్టి పీడించగలను అని శనేశ్వరుడు అనగా పరమేశ్వరుడు సరేనని శానేశ్వరునికి దొరకకుండా అరణ్యంలో ఒక చెట్టు తొరలోకి వెళ్లి దాకుంటాడు.

కొంతసేపటి తరువాత బయటికి వచ్చి నన్ని పట్టి పీడిస్తానని చెప్పి ఏమీ చెయ్యలేకపోయావా అని పరమేశ్వరుడు అనగా అప్పుడు శనేశ్వరుడు ఓ పరమేశ్వరా కైలాశంలో ఉండాల్సిన మీరు ఎక్కడో చెట్టు తొరలోకి వెళ్లి దాక్కోవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంది నా ప్రభావమే కదా స్వామీ అంటాడు.

శనేశ్వరుని మాటలు విన్న పరమేశ్వరుడు ఇకపై త్రయోదశి లో వచ్చే శనివారం అనగా Shani Trayodashi  రోజు నిన్ను ఎవరైతే పూజిస్తారో వారికి వారికి శని భాధలు లేకుండా వారిపై నీ ప్రభావం లేకుండా చూడమని చెబుతాడు దీనినే శనిత్రయోదశి అంటారు. ఈ రోజు పరమేశ్వరుని పూజించినా శనేశ్వరుని పూజించినా వారికి ఎలాంటి శని భాధలు ఉండవని పండితులు చెబుతారు.

శనేస్వరుడు అనురాధ, పుష్యమి, ఉత్తరాబాద్ర మొత్తం మూడు నక్షత్రాలకు అధిపతిగా ఉంటాడు కావున ఈ మూడు నక్షత్రాల వాళ్ళకు ఈ శనిత్రయోదసి నాడు శివునికి, శనీశ్వరునికి ఆరాధన చేస్తే ఈ రాసుల వాళ్లకు మంరింతం ఫలితం లబిస్తుంది. ఇక ఈ రోజు ప్రతీ ఒక్కరూ నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనేశ్వరుని చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాసి శనీశ్వర స్తోత్రం చదవాలి.

Read Also…Tholi Ekadashi: తొలి ఏకాదశి విశిష్టత మరియు పాటించాల్సిన నీయమాలు

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular