శనివారం, మే 18, 2024
HomeజాతీయంSamudrayaan: మత్స్య 6000 తో సముద్ర గర్భంలో పరిశోధనలు చెయ్యనున్న భారత్

Samudrayaan: మత్స్య 6000 తో సముద్ర గర్భంలో పరిశోధనలు చెయ్యనున్న భారత్

భారత్ చంద్రయాన్ 3పేరుతో చంద్రునిపైకి రాకెట్ పంపిన కొద్ది రోజులలోనే మరోప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. అయితే భారత్ చేపట్టనున్న్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లలో సముద్రయాన్ (Samudrayaan) ఒకటి ఈ ప్రాజెక్ట్ గత సంవత్సరమే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతులమీదుగా లాంచ్ చెయ్యగా అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ పై సెరవేగంగా పనులు జరుగుతున్నాయి.

మానవ సహిత జలాంతర్గామి తో సముద్రంలోని మాంగనీస్, కోబాల్ట్, హైడ్రో ధర్మల్ సల్ఫేట్, జలవనరులతో పాటు సముద్ర గర్భంలోని స్థితిగతులు, సముద్ర జీవుల వైవిద్యం లో నెలకొన్న మార్పులు వంటివి ఈ సముద్రయాన్ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు పరిశోధనలు చెయ్యనున్నారు.

ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్ కు మస్త్స్య 6000 (MATSYA 6000) గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు ఈ సుబ్మెరైన్ లో ముగ్గురు శాస్త్రవేత్తల బృందం 6000 మీటర్ల వరకూ సముద్ర గర్భం లోకి వెళ్లి అక్కడ పలు పరిశోధనలు చెయ్యనున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ సంవత్సరం క్రితమే ప్రారంభం అయినా పలు సుబ్మేరైన్ తో శాస్త్రవేత్తలు పలు టెస్ట్ లు చేసిన అనంతరం దీనిని మరింత అతాధునిక టెక్నాలజీతో ఇప్పుడు సముద్ర యానం కోసం త్వరలో ప్రోయోగాలు చేయ్యనున్నట్లు తాజాగా రాజ్య సభలో యూనియన్ మినిస్టర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అంతేకాక ఈ ప్రయోగం ద్వారా సముద్ర జీవులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆతికాక ఈ ప్రయోగం ద్వారా ఎలాంటి హాని కలుగదని ఇది అన్వేషణ కొరకు మాత్రమేనని తెలిపారు. చెన్నై లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈ ప్రయోగాన్ని చేపట్టనుండగా మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి మరో మూడు సంవత్సరాలు పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చు చెయ్యనుంది.

Read Also….Halal Tea: వందేభారత్ ట్రైన్ లో హలాల్ టీ ఇచ్చారంటూ రైల్వే సిబ్బందిపై ప్రయాణికుడి ఆగ్రహం

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular