శనివారం, మే 18, 2024
HomeజాతీయంHalal Tea: వందేభారత్ ట్రైన్ లో హలాల్ టీ ఇచ్చారంటూ రైల్వే సిబ్బందిపై ప్రయాణికుడి ఆగ్రహం

Halal Tea: వందేభారత్ ట్రైన్ లో హలాల్ టీ ఇచ్చారంటూ రైల్వే సిబ్బందిపై ప్రయాణికుడి ఆగ్రహం

Halal Tea: భారతీయ రైల్వే లో హలాల్ సర్టిఫైడ్ పదార్థం తనకు ఇచ్చారని ఒక ప్రయాణికుడు రైల్వే సిబ్బందిని నిలదీసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాలతో వెళితే భారత్ రైల్వే లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ లో ఎప్పటి నుంచో కొన్ని రకాల స్నాక్స్, ఆహార పదార్థాలను ఫ్రీగా అందిస్తుంది. అయితే వీటిలో టికెట్ ఛార్జ్, ప్రీమియం క్లాస్ ను బట్టి ఫుడ్ రేట్స్ అందిస్తుంది. కొన్నిటికి మాత్రం ఫ్రీగా అందిస్తుంది భారత్ రైల్వేస్. అయితే వెజిటేరియన్ కు వెజ్ ఫుడ్, నాన వెజ్ తినేవారికి మాంశాహారం అందిస్తూ వస్తుంది.

అయితే తాజాగా వందే భారత్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి Instant Tea ప్యాకెట్ ను ఇవ్వడంతో సదరు ప్రయాణికుడు ఆ ప్యాకెట్ ను పరిశీలించగా దానిపై హలాల్ సర్టిఫైడ్ ఇని ఉండడంతో వెంటనే రైల్వే సిబ్బందికి కంప్లైంట్ చెయ్యగా ఆ వ్యక్తి ఉన్న సీట్ వద్దకు వచ్చిన రైల్వే సిబ్బంది తన ప్రాబ్లెమ్ చెప్పమనగా తనకు ఇచ్చిన టీ halal tea ప్యాకెట్ పై హలాల్ సర్టిఫైడ్ అని రాసి ఉందని, తాను శాకాహారినని, పూజలు చేసుకునే వ్యక్తినని తనకు హలాల్ టీ ప్యాకెట్ ఎలా ఇస్తారంటూ రైల్వే సిబ్బందిని నిలదీశాడు.

రైల్వే సిబ్బంది ఈ ప్యాకెట్ ప్యూర్ వెజిటేరియన్ ప్రాజెక్ట్ అంటూ దీనిలో ఎలాంటి ఇతర ప్రొడక్ట్స్ లేవని చెప్పినా వినలేదు అయితే తనకు హలాల్ సర్టిఫైడ్ అంటే డెఫినిషన్ చెప్పాలంటూ కోరగా రైల్వే సిబ్బంది మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇకపై ఇలాంటి రిలీజియస్. సర్టిఫికెట్ తమకు అవసరం లేదంటూ ఒకవేళ అలావేస్తే స్వస్తిక్ లోగో కూడా వెయ్యాలన్నాడు దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular