గురువారం, ఫిబ్రవరి 22, 2024
HomeసినిమాSalaar Teaser | రికార్డుల బెండు తీస్తున్న సలార్ టీజర్...ఇది డైనోసర్ వేట

Salaar Teaser | రికార్డుల బెండు తీస్తున్న సలార్ టీజర్…ఇది డైనోసర్ వేట

Salaar Teaser: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న మాస్ అండ్ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్. తాజాగా రిలీజ్ అయిన సినిమా టీజర్ యూట్యూబ్ రికార్డులను నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ యూట్యూబ్ లో వచ్చిన చిన్న, పెద్ద, టాలివుడ్, బాలివుడ్ అంటూ ఒక్కర్ని కూడా వదలకుండా మొత్తం అందరి రికార్డులు ప్రభాస్ దెబ్బకు తుడుచుకుపెట్టుకుపోయాయి.

అయితే ఇప్పటి వరకూ వచ్చిన ప్రభాస్ సినిమాల తన పాత రికార్డులను కూడా తానే సలార్ టీజర్ తో చెరిపేసి కొత్త రికార్డులను క్రియేట్ చేసాడు. ఇండియాతో పాటు ప్రపంచ దేశాలలో ప్రభాస్ ఫాలోయింగ్  ఏ రేంజ్ లో ఉందో  ఈ రికార్డే ఒక నిదర్శనం.

సలార్ టీజర్ 24 గంటల్లో 84 మిలియన్ వ్యూస్ రాబట్టగా 48 గంటల్లో 100 మిలియన్లకు పై వ్యూస్ మరియు 19లక్షల లైక్స్ తో రికార్డుల బెండు తీస్తుంది సలార్ టీజర్. 1.46నిమిషాలు ఉన్న ఈ Salaar Teaser లో ప్రభాస్ ఫుల్ ఫేస్ గాని ఒక్క డైలాగ్ గాని లేకుండానే సలార్ టీజర్ ఈ రేంజ్ లో ఉందంటే ప్రభాస్ ఎలివేషన్ ఇస్తూ ప్రభాస్ డైలాగ్ చెప్పే ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు

Read Also: Salaar Teaser: సలార్ టీజర్ తో ఊచకోత మొదలుపెట్టిన ప్రభాస్ 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular