గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeరాజకీయంచంద్రబాబుకి అండగా... రేపే ఏపీకి రఘురామ కృష్ణం రాజు

చంద్రబాబుకి అండగా… రేపే ఏపీకి రఘురామ కృష్ణం రాజు

ఏపీలో నిన్న రాత్రి పోలీసులు టీడీపీ అద్యక్షుడు చంద్రబాబును అరెస్ట్ చెయ్యడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది 2021 లో చంద్రబాబుకి  నోటీసులు ఇవ్వగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఇప్పుడు హుటాహుటిన రాత్రికి రాత్రి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఒక మాజీ సీయం అని కూడా చూడకుండా తనను నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ అరెస్ట్ చెయ్యడం పై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ ఘటనపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పై పెట్టిన కేసు ఒక తప్పుడు కేసు అని అన్నారు. అంతేకాక ఇది వారిక ఒక క్షణికానందం, సునకానంధం కలిగించిందని అన్నారు. మన నాయకుడు చెప్పాడు కాబట్టి సంయమనం పాటించాల్సిన బాద్యత ఉన్నప్పటికీ ఆయన్ను రక్షించుకోవాల్సిన బాద్యత అంతకు మించి ఉందన్నారు.

ఆయన్ని తెసుకువేల్లెవాళ్ళు ఎలాంటి వారో నాకు తెలుసని కెమెరాలు తీసివేసి తనను చితక్కోట్టారని అన్నారు. తనను చంపెయమన్నారని ఆ వెంకటేశ్వర స్వామీ దయతో బతికి బయటపడ్డానని అలాంటి చెత్త….తీసుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన్ని రక్షించుకోవాల్సిన బాద్యత మనపై ఉందని అన్నారు.

చంద్రబాబు గారి ఒంటిపై చిన్న గీత పడినా వాతలతో మనం సరిపెట్టకూడదన్నారు ఎంపీ గా ఉన్న నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పకూడదని అన్నారు. లోకేష్ గారి ఆవేదన చూస్తుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని తన తండ్రిని కలవకుండా చేసారని అన్నారు.

తనను అరెస్టు చేసినప్పుడు తన కొడుకు, బార్య ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారని, చంద్రబాబు గారు కూడా ఎంతో కోపరేట్ చేసి బయటికి తీసుకురావడంలో సహాయం చేసారని అన్నారు.

తాను తన యాత్ర తొందరగా ముగించుకుని రేపు సాయత్రం బయలుదేరి రాష్ట్రానికి వచ్చేస్తున్నానని తెలిపారు. అందరం ఆయనికి అండగా ఉండాలని అంతేకాక నేటితో ఈ దరిద్రుడి దరిద్రం వదిలిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారని మొన్నటిదాకా 25-30 సీట్లు అనుకున్నాం కాని 10 సీట్లు కూడా వస్తాయో లేదోనని అందరి స్కోరు సెటిల్ చేద్దామని ఒక 10శాతం చెత్త ఉందని వారిని వేరేయ్యాలని అన్నారు.

త్వరలోనే ప్రభుత్వం మారుతుందని అన్యాయం చేసిన పాలకులని ఆ పాలకులకి సపోర్ట్ చేసిన కొద్దిమందిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు నాయకులు చంద్రబాబు అరెస్టును కండిస్తున్నారు.

Read Also..yarlagadda venkata Rao : వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరిన యార్లగడ్డ          

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular