గురువారం, ఫిబ్రవరి 29, 2024
Homeఅంతర్జాతీయం31 ప్రేడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఆమోదం ..శత్రు దుర్భేద్యంగా భారత్

31 ప్రేడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఆమోదం ..శత్రు దుర్భేద్యంగా భారత్

భారత్ గతంలో అమెరికా నుండి లీజుకు తెచ్చిన ప్రేడేటర్ డ్రోన్ల లీజ్ పొడిగింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాక ఎప్పటినుంచో డ్రోన్ల కొరత ఉండడంతో అమెరికాకు చెందినా మరో 31 ప్రేడేటర్ డ్రోన్లను కొనుగోలు చెయ్యడానిక్కి భారత్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

దీనిలో బాగంగానే మొన్నటి నెలలో ప్రదానిమోదీ అమెరికా పర్యటనలో ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ 31 ప్రేడేటర్ డ్రోన్లను విడి భాగాలను భారత్ కు తీసుకువచ్చి పూర్తి మ్యానిఫ్యాక్చరింగ్ భారత్ లోనే చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్ తో సముద్ర , విస్తారమైన భూ బాగాన్ని పంచుకుంటున్న దేశాలైన పాకిస్థాన్ మరియు చైనా తో పటు మరికొన్ని దేశాల సరిహద్దుల రక్షణ మరియు నిఘా మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని త్రివిధ దళాలు కలిసి వీటిని వాడనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీటిలో 16 డ్రోన్లను నేవీ హింద్ మహాసముద్రం వద్ద ఉపయోగించనుంది మిగిలిన డ్రోన్లను ఆర్మీ కీలక సరిహద్దుల వద్ద వీటిని వాడనుండగా మరికొన్ని వాయుసేన వినియోగిస్తుంది.

మొత్తం 31 ప్రేడేటర్ డ్రోన్లకు గాను మొత్తం 4 బిలియన్ డాలర్లు వీటికి ఖర్చు చేయ్యనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఈ ప్రేడేటర్ డ్రోన్ల కొనుగోలు పై పలు విమర్శలు గుప్పిస్తుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ కేంద్రం ప్రేడేటర్ డ్రోన్లను అత్యధిక ధరకు కొనుగోలు చెస్తుందని, ఈ డీల్ లో పారదర్శకత లేదనారు 4 బిలియన్ డాలర్లలో DRDO కు పదిశాతం ఖర్చు చేసినా ఇలాంటివి డ్రోన్లు ఇండియాలోనే తయారు చేయ్యవచ్చని అన్నారు.

అయితే బీజేపీ ప్రభుత్వం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా ఉండడం వల్ల ఈ డీల్ మిగతా వాటికంటే ఎక్కువని చెబుతోంది అయితే కాంగ్రెస్ మాత్రం 8 శాతం మాత్రమె టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు డీల్ కుదిరిందని దీనికి అంత ఖర్చు ఎలా పెడతారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కొనేందుకు బీజేపీ రంగంలోకి దిగింది.

Read Also…MQ-9 డ్రోన్ పై రష్యా యుద్ధవిమానంతో ఎటాక్ చేసి కూల్చివేసిందంటూ వీడియో రిలీజ్ చేసిన అమెరికా

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular