May 26, 2020

బామ్మను చంపేసిన చిరుత .. అంతా అలర్ట్ | Prajavaradhi

tiger

tiger

లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకి రావడంలేదు కానీ వన్యప్రాణులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అలాగే జనావాసాలు తక్కువగా ఉన్న చోట బాగా సంచరిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కువ రాకపోకలు లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు అటవీ శాఖా అధికారులు. ఇదిలా ఉండగా  కొట్టగణహల్లి గ్రామానికి చెందిన గంగమ్మ (68)ఈ ఉద‌యం వాకింగ్ ‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై చిరుత దాడి చేసింది దీంతో బామ్మ గ‌ట్టిగా అరుస్తూ అక్క‌డే తన ప్రాణాలు వదిలేసింది. ఆ కేకలకు అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

రంగంలోకి దిగిన  పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్ట‌మ్ కోసం నీలమంగళ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ చుట్టుపక్క గాలించినా అటవీశాఖ అధికారులకి  చిరుత ఆచూకీ లభించలేదు. ఈ సంఘటనతో ఆ గ్రమస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక ఇలాంటి ఘటనే కదిరైహన పాల్యలో మూడేళ్ల బాలుడు హేమంత్‌పై కూడా చిరుత దాడి చేసింది. దీంతో హేమంత్‌ మృతి చెందాడు. ఈ ఘటన మే 9న చోటు చేసుకుంది.

బెంగళూరు సమీపాల్లో  చిరుత కొద్ది రోజుల నుంచి సంచరిస్తున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. బెంగళూరు శివారులోని ఈ ఘటన మరువకముందే తాజాగా 68 ఏళ్ల మహిళను చిరుత చంపేసింది. అయితే హేమంత్‌ను చంపేసిన చిరుతను పట్టుకుని అడవిలో వదిలేశామని అధికారులు తెలిపారు. మళ్లీ అదే చిరుత జనవాసాల్లోకి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *